కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకి చెందిన బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ లో(బీఈసీఐఎల్) డేటా ఎంట్రీ ఆపరేటర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు పడ్డాయి.
ఢిల్లీలోని ప్రభుత్వ ఆస్పత్రిలో 51 ఖాళీలు ఉన్నాయి. 48 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు, 3 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
డేటా ఎంట్రీ ఆపరేటర్ అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీలో ఇంటర్ లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
కంప్యూటర్ లో ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ కనీసం నిమిషానికి 35 పదాలు టైప్ చేయగలిగేలా ఉండాలి.
హిందీలో నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలిగే టైపింగ్ స్పీడ్ ఉన్నా పర్లేదు.
డేటా ఎంట్రీ ఆపరేటర్ జీతం: నెలకు రూ. 20,202/-
టెక్నికల్ అసిస్టెంట్ అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థలో లేదా యూనివర్సిటీలో స్పీచ్ అండ్ హియరింగ్ లో బి.ఎస్సీ. డిగ్రీ చేసి ఉండాలి.