నేచురల్ స్టార్ నాని పూర్తిస్థాయి మాస్ అవతార్ లో కనిపించిన సినిమా 'దసరా'.
రిలీజ్ కు ముందే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ మూవీ తాజాగా థియేటర్లలోకి వచ్చింది.
పాన్ ఇండియా వైడ్ విడుదలైన ఈ సినిమా.. అన్నిచోట్ల కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
హీరో నాని, హీరోయిన్ కీర్తి సురేష్, ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన దీక్షిత్ శెట్టి యాక్టింగ్ తో ఇచ్చిపడేశారు.
నాని కూడా ఊరమాస్ గెటప్ లో కనిపించి, ఫ్యాన్స్ తోపాటు ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చాడు.
డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు అందరూ ఫిదా అయిపోయారు. తర్వాత సినిమా ఎప్పుడు చేస్తాడా అని చూస్తున్నారు.
ఇక కలెక్షన్స్ విషయానికొస్తే తొలిరోజు నాని విశ్వరూపం చూపించాడు. తన గత చిత్రాల రికార్డ్స్ ని బ్రేక్ చేశాడు.
నాని తన గత సినిమాలకు ఓవరాల్ గా వసూలు చేసిన మొత్తం కంటే.. 'దసరా' ఫస్ట్ డేన ఎక్కువగా వచ్చాయి.
ఇంకా చెప్పాలంటే నైజాంలో ఇప్పటివరకు చిరంజీవి, బాలకృష్ణ పేరిట ఉన్న రికార్డ్స్ ని నాని బీట్ చేశాడు.
ఈ సంక్రాంతికి నైజాంలో తొలిరోజు 'వాల్తేరు వీరయ్య'కు రూ 6.05 కోట్లు, 'వీరసింహారెడ్డి'కు రూ 6 కోట్లు వచ్చాయి.
తాజాగా థియేటర్లలోకి వచ్చిన నాని 'దసరా' .. ఈ రెండు సినిమాలని దాటి ఏకంగా రూ 6.75 కోట్లు సాధించింది.
ఇదే కాదు సీడెడ్ లో రూ 2.3 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ 1.5 కోట్లు, గుంటూరులో రూ 1.21 కోట్లు వచ్చాయి.
ఈస్ట్ లో రూ 86.17 లక్షలు, వెస్ట్ లో రూ 53 లక్షలు, కృష్ణాలో రూ 62 లక్షలు, నెల్లూరులో రూ 34 లక్షలు వచ్చాయి.
వీటిలో నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర, గుంటూరు, కృష్ణాలో నాని.. 'దసరా'తో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశాడు.
అలా తెలుగు రాష్ట్రాల్లో కలిపి 'దసరా'కు తొలిరోజు రూ. 26 కోట్లకు పైన, మిగతా అన్నిచోట్ల కలిపి రూ.12 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది.
'దసరా'.. తొలిరోజు వసూళ్లలో వరల్డ్ వైడ్ రూ. 38 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిందని నిర్మాణ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసి ప్రకటించింది.
ఇది చూసిన ప్రేక్షకులు.. నాని కూడా త్వరలో రూ 100 కోట్ల క్లబ్ లో చేరిపోతాడని ధీమాగా ఉన్నారు.
అలానే తొలి ప్రయత్నంలో పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకుల్న ఆకట్టుకున్నాడని నాని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
మరి 'దసరా' మీలో ఎంతమంది చూశారు? తొలిరోజు కలెక్షన్స్ పై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.