ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఆహార నియమాలు పాటించకుండా ఎన్నో రకాల తప్పులు చేస్తున్నారు.
ఇలాంటి తప్పులు చేయడం ద్వారా లేనిపోని అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
అయితే మరీ ముఖ్యంగా చాలా మంది ఎక్కడికైన ప్రయాణాలకు కానీ, విహార యాత్రలకు కానీ వెళ్లినప్పుడు మూత్రం పోయడానికి కాస్త ఇబ్బందిగా ఫీలవుతుంటారు.
సమయానికి మూత్రం పోయకుండా అలాగే ఆపుకుంటుంటారు.
అలా మూత్రాన్ని పోయకుండా ఆపుకోవడం ద్వారా లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
అసలు నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
సమయానికి మూత్రం పోయకుండా ఆపుకుంటే మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
బ్యాక్టిరియా కూడా పెరిగే అవకాశం కూడా లేకపోలేదని నిపుణులు తెలియజేస్తున్నారు.
మూత్రాన్ని సమయానికి పోయకపోవడం వల్ల మూత్రపిండాల సమస్య వస్తుందని తెలియజేస్తున్నారు.
మరీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మాత్రం మూత్రం ఆపుకోవడం చాలా ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటి నుంచైనా సమాయానికి మూత్రం పోసి ఆరోగ్యంగా ఉండాలని నిపుణులు తెలియజేస్తున్నారు.
నోట్: పై విషయాలు పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్ లేదా నిపుణులని సంప్రదించడం ఉత్తమం.