హీరో నాగచైతన్య పేరు చెప్పగానే అక్కినేని లవర్ బాయ్ అని ఫ్యాన్స్ ముద్దుగు పిలుచుకుంటూ ఉంటారు.

అందుకు తగ్గట్లే చైతూ ఎప్పటికప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలతో ఎంటర్ టైన్ చేస్తూ ఉంటాడు.

చివరగా 'థ్యాంక్యూ'తో ప్రేక్షకుల్ని పలకరించిన చైతూ.. మే 12న 'కస్టడీ'తో థియేటర్లలోకి రాబోతున్నాడు.

ఈ మధ్య కాలంలో చైతూ బయట ఎక్కడా పెద్దగా కనిపించలేదు. కానీ ఓ విషయమై చర్చనీయాంశమయ్యాడు.

అలా అని ఈ న్యూస్ కి.. హీరో నాగచైతన్య వ్యక్తిగత జీవితానికి అస్సలు సంబంధం లేదు. సినిమాలతోనే సంబంధం ఉంది.

ఎందుకంటే తాజాగా హీరోయిన్ దక్ష మాట్లాడుతూ.. నాగచైతన్య గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేసింది.

ఓసారి తనకు ముద్దుపెట్టి చైతూ సారీ చెప్పాడనే షాకింగ్ విషయాన్ని హీరోయిన్ దక్ష బయటపెట్టింది.

రవితేజ 'రావణాసుర'లో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా నటించిన దక్ష.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చైతూ గురించి మాట్లాడింది.

బంగార్రాజు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చైతూని ఓరకంట చూస్తూ అప్పట్లో దక్ష బాగా ఫేమస్ అయింది.

ఈ విషయమై యాంకర్ మాట్లాడుతూ.. దక్షని నాగచైతన్యతో బాండింగ్, సెట్ లో ఎలా ఉంటారని అడిగింది.

దీనికి బదులిచ్చిన దక్ష.. బంగార్రాజు మూవీలో చైతూతో స్క్రీన్ షేర్ చేసుకోవడం తన లక్ అని చెప్పింది.

తోటి నటీనటులపై చైతూ చాలా కేర్ చూపిస్తానడని, డైరెక్ట్ గా అది చూశానని హీరోయిన్ దక్ష చెప్పింది.

తామిద్దరి మధ్య ముద్దు సీన్స్ పూర్తయిన తర్వాత తనకు సారీ చెప్పాడని హీరోయిన్ దక్ష పేర్కొంది.

'నాగ చైతన్య జెంటిల్ మెన్ అని చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలి?' అని దక్ష చైతూని తెగ పొగిడేసింది.

ప్రస్తుతం  చైతూ-దక్ష మధ్య జరిగిన ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మరి హీరోయిన్ దక్ష చెప్పిన దానిపై మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.