కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!

దర్శకుడు వెంకట్ ప్రభు సినిమాలకి తెలుగునాట  అభిమానులు ఉన్నారు. అలాంటి డైరెక్టర్ తో  అక్కినేని నాగచైతన్య చేసిన సినిమా ‘కస్టడీ’.

ఈ క్రేజీ కాంబోలో వచ్చిన కస్టడీ మూవీ ఎలా  ఉంది? అక్కినేని అభిమానులను మెప్పిస్తుందా?  లాంటి విషయాలను ఈ రివ్యూలో  తెలుసుకుందాం.

ముందుగా కథ విషయానికి వస్తే.. సఖినేటిపల్లి  పోలీస్ స్టేషన్ లో ఓ సాధారణ కానిస్టేబుల్ శివ  (నాగ చైతన్య). ఇతని జీవితంలోకి అనుకోకుండా  రాజు ( అరవింద్ స్వామి) అనే గ్యాంగ్ స్టర్ వస్తాడు. 

పోలీసులు, రౌడీలు, రాజకీయ నాయకులు అంతా  రాజుని చంపేయాలని చూస్తే.. శివ మాత్రం అతన్ని  కాపాడటానికి ముందుకి వస్తాడు. ఈ క్రమంలో ఎన్నో  ఇబ్బందులు ఎదుర్కొంటాడు. 

అసలు రాజు లాంటి గ్యాంగ్ స్టర్ కోసం శివ ఎందుకు  ఇంతటి రిస్క్ చేశాడు? శివకి, రాజుకి ఉన్న సంబంధం  ఏమిటి? ఈ ప్రాసెస్ లో హీరో విజయం  సాధించాడా? లేదా? అన్నదే కస్టడీ 

కాప్ బేస్డ్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన కస్టడీ  మూవీలో సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ అయిపోయింది.  అలా అని దాన్ని సినిమా లెవల్ పెంచడానికి  ఉపయోగించుకున్నారా అంటే.. అదీ లేదు! 

‘సరోజా’, ‘గోవా’, ‘గ్యాంబ్లర్’, ‘మానాడు’ వంటి  సినిమాలతో మంచి డైరెక్టర్ గా గుర్తింపు  దక్కించుకున్న వెంకట్ ప్రభు కస్టడీ విషయంలో  మాత్రం ట్రాక్ తప్పేశాడు.

ప్రథమార్ధం కాస్త పర్వాలేదు అనిపించినా..  సెకండ్ ఆఫ్ లో మాత్రం రిపీటెడ్ సీన్స్  పెట్టి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు. 

ఏ మాత్రం కనెక్ట్ కాలేని లవ్ ట్రాక్, సాంగ్స్  ఈ చిత్రానికి మరో పెద్ద మైనస్. 

నాగచైతన్య మాత్రం కస్టడీ మూవీ కోసం  చాలా కష్టపడ్డాడు. దర్శకుడిని తాను పూర్తిగా  నమ్మి స్వేచ్ఛ ఇచ్చేశాడు. కానీ.., ఇదే మిస్ ఫైర్  అయినట్టు అనిపిస్తోంది!

అరవింద్ స్వామి, శరత్ కుమార్,   కృతి శెట్టి నటన బాగుంది.

సాంకేతిక విభాగంలో మ్యూజిక్ డిపార్ట్మెంట్  పూర్తిగా నిరాశ పరిచింది. కానీ సినిమాటోగ్రఫీ  మాత్రం అదిరిపోయింది

కస్టడీ నిర్మాణ విలువల విషయంలో ఎలాంటి  లోపాలు లేవు. కథకి కావాల్సిన రీతిలో  బాగానే ఖర్చు పెట్టారు.

ఫస్ట్ హాఫ్ అంత ఎంగేజింగ్ గా సెకండ్ హఫ్  కూడా ఉండి ఉంటే కస్టడీ ఫలితం  మరోలా ఉండేది.

ఓవరాల్ గా సాధారణ స్క్రీన్ ప్లే తో కస్టడీ  ఓ సాధారణ సినిమాగా మిగిలిపోయింది.

రేటింగ్: 1.75/5