ఈ వేసవిలో మనల్ని అలరించేందుకు బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రాబోతున్నాయి.

జులై-ఆగస్టు వరకు పలు సినిమాల తేదీలను ప్రకటించేశారు దర్శక, నిర్మాతలు. 

ఇందులో డైరెక్ట్ తెలుగు సినిమాలు కస్టడీ, హనుమాన్‌లు ఉన్నాయి.

అదేవిధంగా ప్రభాస్ ఆది పురుష్, ఆయనకు పేరు తెచ్చిన చిత్రం ఛత్రపతి( హిందీ రీమేక్ ) సినిమాలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి.

ఈ విషయాన్నిఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డాటాబేస్‌) వెల్లడించింది.

ఐఎండీబీ ప్రకారం మోస్ట్‌ యాంటిసిపేటెడ్‌ ఇండియన్‌ ఫిలిమ్స్‌ ఆఫ్‌ ది సమ్మర్‌-2023లో టాప్‌ 10 సినిమాల జాబితాను చూస్తే

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న కస్టడీ మే 12న విడుదల కాబోతుంది. 

ఇది ఈ జాబితాలో టాప్ 10 లో ఉంది.  బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఛత్రపతి మే 12న ఆ రోజే విడుదల కాబోతుంది. అయితే అది హిందీలో.  

ఛత్రపతి ఐదో స్థానంలో ఉండగా.. తెలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్ హనుమాన్‌ 9వ స్థానంలో నిలిచింది. 

కస్టడీ మాత్రం తెలుగు, తమిళ భాషల్లో రాబోతుంది. కస్టడీని వెంకట్ ప్రభు  డైరెక్ట్‌ చేస్తున్నాడు

NC22గా తెరకెక్కుతున్న కస్టడీ గ్లింప్స్ వీడియో, టీజర్‌ ఇప్పటికే లాంఛ్ చేయగా.. ఆసక్తిని పుట్టిస్తోంది. 

కస్టడీలో నాగచైతన్యకు జోడీగా ఉప్పెన ఫేం కృతిశెట్టి నటిస్తోంది. ఈ మూవీలో పోలీసాఫీసర్‌ శివగా చైతూ కనిపించబోతున్నాడు.

కస్టడీలో అరవింద్‌ స్వామి విలన్‌గా నటిస్తుండగా… వెన్నెల కిశోర్‌, శరత్‌కుమార్‌, ప్రేమ్‌గీ అమరేన్‌, సంపత్ రాజ్, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కస్టడీకి సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచిన సినిమా ఏంటో తెలుసా..ప్రముఖ తమిళ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న జవాన్. ఇందులో షారుఖ్ ఖాన్ నటిస్తున్న సంగతి విదితమే. 

యానిమల్  రెండవ స్థానంలో ఉండగా.. 

ఓం రౌత్ , ప్రభాస్ సినిమా ఆది పురుష్ మూడో స్థానంలో ఉంది.

మైదాన్, యోధా, గదర్ -2 కూడా మోస్ట్ యాంటిసిపెటెడ్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.