చాలా ఏళ్ల క్రితం నుంచే మన దేశ ప్రజలు తమ వంటకాల్లో కరివేపాకును ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

దీనిని వంటల్లో వేయడం వల్ల మంచి రుచి, వాసన వస్తుంది. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

కరివేపాకులో ఇనుము, ఫోలిక్ యాసిడ్, పీచు, జింక్, కాపర్, విటమిన్స్ ఎక్కువగా ఉన్నాయి.

అయితే కరివేపాకులోని పోషక విలువల గురించి తెలియక పెద్దవాళ్ల దగ్గర నుంచి పిల్లల వరకు తీసి పడేస్తుంటారు.

కరివేపాకు వల్ల అందం, ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనితో పాటే ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

జీర్ణ వ్యవస్థ మెరుగుపరచడం, డయేరియా నివారించడం, కొవ్వు తగ్గించడంలో కరివేపాకు చక్కగా పనిచేస్తుంది.

కరివేపాకుతో జుట్టు రాలడాన్ని అడ్డుకోవచ్చు. దీన్ని ముద్దలా తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే, క్రమంగా జట్టు పెరుగుతుంది.

ఇనుము, పోలిక్ యాసిడ్ అధికంగా కరివేపాకుని ఫుడ్ తో తీసుకోడవం వల్ల రక్తహీనత దూరమవుతుంది.

కరివేపాకులో షుగర్ లెవల్స్ తగ్గించే గుణాలు ఉన్నాయి. ఐరన్, జింక్, కాపర్ తదితర పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి.

ఇది క్లోమా గ్రంధిని ఉత్తేజపరిచి, ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.

కరివేపాకు మన శరీరంలో ఉండే కొవ్వును తగ్గించే గుణం ఉంది. ఇది బరువు పెరగకుండా శరీరాన్ని నియంత్రిస్తుంది.

నిత్యం భోజనానికి ముందు కొన్ని కరివేపాకులను నమిలి తింటే శరీరంలో కొవ్వు చేరకుండా ఉంటుంది.

కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండెకు మేలు చేస్తాయి.

కరివేపాకులో యాంటీ బ్యాక్టీరియాల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. అందువల్ల ఇన్ఫెక్షన్లు రావు.

కరివేపాకు రోజూ తినడం వల్ల జ్వరం, శ్వాసకోస సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది.

నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.