మనం నిత్యం ఆహారంలో ఉపయోగించే కరివేపాకు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లతో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.

కరివేపాకులు   విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ బి2, కాల్షియం పుష్కలంగా ఉన్నాయి

కరివేపాకు జీర్ణశక్తిని పెంచుతుంది.. కడుపులో ఉండే అనవసరమైన వ్యర్థాలను తొలగిస్తుంది. 

కరివేపాకు జుట్టుని ఆరోగ్యవంతంగా ఉంచడమే కాదు.. పెరుగుదలకు తోడ్పడుతుంది.. అలాగే చుండ్రుని నివారిస్తుంది. 

కరివేపాకులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.. ఇది కంటి సమస్యలను దూరం చేస్తుంది.. రెటీనాను సురక్షితంగా ఉంచుతుంది.

కరివేపాకు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.. అధిక బరువును తగ్గిస్తుంది.

కరివేపాకు ప్రతిరోజూ తినడం వల్ల రుతుక్రమ సమస్యలు, గనేరియా, విరేచనాలు తగ్గించడంలో సహాయపడుతుంది. 

కరివేపాకు ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ప్యాంక్రియాటిక్ కణాలు ప్రేరేపిస్తుంది.. ఇందులో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. 

కరివేపాకును పేస్ట్ గా చేసి గాయాలు, దద్దుర్లు, కురుపులపై అప్లై చేస్తే చక్కటి ప్రభావం చూపిస్తుంది.

కరివేపాకు, నిమ్మరసం కలుపుకొని రెండు చెంచాలు తాగితే వికారం, వాంతులు తగ్గిపోతాయి.

జ్వరం వస్తే కరివేపాకు కషాయాన్ని తాగితే వెంటనే తగ్గిపోతుంది.

కరివేపాకు శ్వాసకోశ వ్యాధుల నుంచి  ఉపశమనం ఇస్తుంది.