ప్రతి ఏడాదిలానే ఈసారి వింటర్ వచ్చేసింది. చలితీవ్రత కాస్త ఎక్కువగానే ఉంది.

దీంతో జనాలు వేడి వేడి టీ, కాఫీలు.. స్పైసీగా ఉండే హాట్ సూప్స్, మసాలా ఫుడ్స్ తింటూ బాడీని హీట్ గా ఉంచుతున్నారు.

అయితే ఉష్ణోగ్రత తక్కువయ్యేకొద్దీ వైరస్ లు, బ్యాక్టీరియాలు ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్లు కూడా పెరుగుతుంటాయి.

అందుకే ఇంట్లో నేచురల్ గా లభించే బెల్లం లాంటి పదార్థాలను వీలైనంత వరకు తీసుకోవాలి.

చలికాలంలో బెల్లం తినడం వల్ల దగ్గు, జలుబు తగ్గుతాయి. శ్వాసకోస వ్యవస్థ శుభ్రంగా మారుతుంది.

బెల్లం వల్ల ఊపిరితిత్తులకు కావాల్సిన వేడి లభిస్తుంది. గొంతులో ఇన్ఫెక్షన్లు, ఇరిటేషన్ కూడా తగ్గుతాయి.

వయసు పెరిగేకొద్దీ ఎముకలు బలహీనంగా మారుతుంటాయి. దీంతో నొప్పులు వస్తాయి.

బెల్లంలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు.. ఎముకలని దృఢంగా మారుస్తాయి. ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటపడొచ్చు.

చలితీవ్రత పెరిగేకొద్ది ఆస్తమా ఎక్కువవుతుంటుంది. దీని నుంచి బయటపడాలంటే ఈ సీజన్ మొత్తం బెల్లం తినాలి.

బెల్లంలోని యాంటీ అలెర్జిక్ గుణాలు ఉంటాయి. ఇవి ఆస్తమా అటాక్స్ రాకుండా చూసుకుంటాయి.

చలికాలంలో వ్యాధులు రాకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తి ముఖ్యం. దానికి బెల్లం ఎంతో ఉపయోగపడుతుంది.

ఇది తినడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్సులు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. బాడీలోని ఫ్రీ ర్యాడికల్స్ తగ్గిపోతాయి.

రోజూ బెల్లం తినడం వల్ల రక్తం ప్యూరిఫై అవుతుంది. అలానే శరీరంలోని చాలా మలినాలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్తాయి.

బెల్లంలోని పొటాషియం బీపీని నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజూ బెల్లం తింటే ఇది సాధ్యమవుతుంది.

ఓ గ్లాస్ నీటిలో కొద్దిగా అల్లం రసం, కొంత బెల్లం వేసి బాగా కలిపి ఆ నీరు తాగితే వెక్కిళ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది.

చలికాలంలో చర్మం పగులుతుంది. దాన్ని నివారించాలంటే రోజూ కాస్త బెల్లం తినండి. దీంతో చర్మం సాఫ్ట్ గా తయారవుతుంది. కాంతివంతంగానూ మెరుస్తుంది.

నోట్: పైన చెప్పిన చిట్కాలు పాటించేముందు ఓసారి డాక్టర్, నిపుణుల సలహా కూడా తీసుకోండి.