పిల్లలు అన్న తర్వాత రాత్రిళ్లు పక్క తడుపుకోవటం మామూలే.

పిల్లలు రాత్రిళ్లు పక్క తడపటానికి చాలా కారణాలు ఉంటాయి. 

పిల్లలు పక్క తడిపే అలవాటుని వైద్య పరిభాషలో నాక్టర్నల్ ఎన్యురెసిస్ అంటారు.

కొంతమందిలో దాదాపు 12- 15 సంవత్సరాలు వచ్చే వరకు ఈ అలవాటు ఉంటుంది.

ఈ అలావాటును మాన్పించాలంటే .. ఈ చిట్కాలను వాడండి..

గది ఉష్ణోగ్రతలు చల్లగా ఉండకుండా చూసుకోవాలి. 

పడుకోబోయే ఓ గంట ముందు నుంచి ఎలాంటి ద్రవాహారాలు తీసుకోకూడదు.

పడుకునే ముందు ఓ సారి మూత్ర విసర్జన చేయించాలి.

వారికి పూటకో అరటిపండు తినిపిస్తే మంచి ఫలితం ఉంటుంది. అరటి జీర్ణవ్యవస్థకు తోడ్పడుతూ, మూత్రాశయంలో అదనపు ద్రవాన్ని నిరోధిస్తుది.

 రాత్రిళ్లు కాకుండా.. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అరటిపండు తినిపించాలి

దాల్చిన చెక్కను పొడిచేసి  కొంచెం తేనెలో కలిపి పిల్లలకు ఇవ్వాలి.

రాత్రి వేళల్లో పిల్లలు స్వీట్లు, చాక్లెట్లు వంటివి అస్సలు తినిపించకూడదు.

ఇన్ని చేసినా పిల్లలు అలవాటు మానకపోతే డాక్టర్‌ దగ్గరకు వెళ్లిపోవటం మంచిది.