సోంపును భారతీయ ఆహారాల్లో వివిధ రకాల వంటకాలు చేయడానికి ఉపయోగిస్తారు. మౌత్ ఫ్రెషనర్‌గా కూడా ఉపయోగిస్తారు.
సోంపులో చాలా పోషకాలు ఉన్నాయి. కాల్షియం, ఐరన్ లాంటివి ఉంటాయి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో సోంపు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
సోంపులో పీచు కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది.
దీన్ని ఉదయాన్నే అంటే పరగడుపునే తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ సెట్ అయిపోతుంది.
ఇది జీర్ణక్రియకు సంబంధించిన చాలా సమస్యల నుంచి బయటపడటానికి సహాయపడుతుంది.
ఇది మలబద్ధకం సమస్య నుండి ఉపశమనాన్ని అందించడానికి పనిచేస్తుంది.
సోంపులో విటమిన్ సి ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో సోపును తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది.
సోంపులో కాల్షియం ఉంటుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.
ఇది బోలు ఎముకల వ్యాధి లాంటి వ్యాధులను దూరం చేస్తుంది.
సోంపులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం లోటు ఉండదు.
రక్తహీనత సమస్య నుంచి మిమ్మల్ని కాపాడేందుకు ఇది పనిచేస్తుంది.
నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా తీసుకోండి!