టాలీవుడ్ గురించి, లేదా నటీనటుల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ప్రేక్షకులు అలెర్ట్ అయిపోతారు. 

ఇక నటీనటులు పెళ్లి చేసుకున్నా, వారి కుటుంబ సభ్యులకు పెళ్లి జరిగినా సరే వధువు లేదా వరుడు డీటైల్స్ ఏంటా అని తెగ ఆరా తీస్తారు.

రీసెంట్ టైంలో హీరో నాగశౌర్య పెళ్లి చేసుకోగా.. తాజాగా ప్రముఖ కమెడియన్ అలీ పెద్ద కూతురి నిఖా(పెళ్లి) గ్రాండ్ గా జరిగింది.

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోల దగ్గర నుంచి ఏపీ సీఎం జగన్ వరకు అందరూ వచ్చి, వధూవరులను ఆశీర్వదించారు

ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఇక పెళ్లి కొడుకు ఎవరా అని కూడా నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు.

ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా అలీ గుర్తింపు తెచ్చుకున్నారు. బాల నటుడిగా పరిచయమైన అతడు.. ప్రస్తుతం హాస్యనటుడిగా మాత్రమే కాకుండా హీరోగా, నిర్మాతగానూ పలు చిత్రాలు చేస్తున్నారు.

టీవీ షోకు హోస్ట్ గానూ నిరూపించుకున్నారు. ఇక ఏపీ ప్రభుత్వంలోనూ ఎలక్ట్రానికి మీడియా సలహాదారుగా మరో రెండేళ్ల పాటు ఉండనున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఆయన పెద్ద కుమార్తె ఫాతిమా నిఖా(పెళ్లి).. హైదరాబాద్ లో ఆదివారం గ్రాండ్ గా జరిగింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ తో పాటు చిరంజీవి, నాగార్జున లాంటి సెలబ్రిటీలు కూడా ఈ వేడుకకు వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. 

ఈ సందర్భంగా అలీ అల్లుడు బ్యాక్ గ్రౌండ్ గురించి పలు వార్తలు వినిపించాయి.

అలీ పెద్ద కూతురు ఫాతిమా.. రీసెంట్ గానే డాక్టర్ కోర్సు కంప్లీట్ చేసి.. కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్ అయింది.

అలీ అల్లుడు షెహ్యాజ్ కూడా డాక్టరే కావడం విశేషం.

జమీలా బాబీ, జలానీ భాయ్ దంపతుల కుమారుడు షెహ్యాజ్. ఆయనకు ఓ అన్నయ్య, సోదరి ఉన్నారు.

వీళ్లిద్దరితో పాటు షెహ్యాజ్ వదిన కూడా డాక్టరే. వీరంతా గుంటూరుకు చెందిన వారు అయినప్పటికీ, లండన్ లో ఉంటున్నారు.

షెహ్యాజ్ కుటుంబం ఆర్థికంగా, విద్యాపరంగా ఉన్నత కుటుంబం. ఇంట్లో అందరూ డాక్టర్లే కావడంతో షెహ్యాజ్ కూడా ఎంతో కష్టపడి డాక్టర్ చదివినట్లు తెలుస్తుంది.

ఇక కూతురు డాక్టర్ చదివేసరికి.. అల్లుడిని కూడా డాక్టరే కావాలని.. ఏరికోరి షెహ్యాజ్ ని ఎంపిక చేసుకున్నారట.

ఇక ఈ పెళ్లికి సంబంధించిన అన్ని అప్డేట్స్ కూడా అలీ భార్య ఎప్పటికప్పుడు యూట్యూబ్ వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నారు.