మనిషి ఆరోగ్యంగా ఉండటానికి పరిశుభ్రతే కీలకం. 

ముఖ్యంగా శరీరం నీట్ గా ఉంటేనే చాలా వరకు మనం ఆరోగ్యంగా ఉంటాం.

అందుకే వైద్య నిపుణులు వీలైతే రోజుకు రెండు సార్లు స్నానం చెయ్యాలి అని సూచిస్తారు.

ఐతే ఇక్కడ అందరకి వచ్చే ఒకే ఒక్క అనుమానం చన్నీళ్లతో స్నానం చేయాలా? వేడినీటితో స్నానం చేయాలా? అని.

ఏ నీటితో స్నానం చేస్తే ఏ ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మంది చల్లని నీటితో స్నానం చేస్తే జలుబు వస్తుందని అనుకుంటారు. కానీ రాదని నిపుణులు చెబుతున్నారు.

చన్నీటి స్నానం వల్ల చర్మం కూడా ధృఢంగా మారుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

శరీరం రిలాక్స్ అవ్వడం కోసం చల్లని నీరే బెటర్. ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది.

దాంతో అధిక బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయని వైద్యలు చెబుతున్నారు.

ఇక వేడినీటి స్నానంతో శరీరానికి హాయిగా  ఉంటుంది. పైగా అలసట కూడా తగ్గుతుంది.

వేడినీరు స్నానంతో కండరాలు రిలాక్స్ అవ్వడంతో పాటు నొప్పులు కూడా తగ్గుతాయి.

వేడినీరు చర్మంపై పడగానే చర్మ రంధ్రాలు తెరచుకుని, స్కిన్ శుభ్రంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.