ప్రస్తుతం మనం కాలుష్యం, కలుషితాలతో సహజీవనం చేస్తున్నాం.

ఊపిరితిత్తులు శరీరానికి ఆక్సిజన్‌ను సరఫరా చేస్తాయి.

శరీరానికి ఆక్సిజన్‌ సరిగా అందకపోతే అది కణాలపై ప్రభావం చూపుతుంది.

అందుకే ఊపిరితిత్తులని ఎప్పటికప్పుడు సెల్ఫ్ సర్వీసింగ్ చేయించాలి. 

పరగడుపున ఒకటి లేదా రెండు చెంచాల అల్లం రసం తీసుకుంటే మంచిది.

పరగడుపున ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగాలి.

ఉదయాన్నే 3 నుంచి 5 పుదీనా ఆకులని నమిలి మింగాలి.

రోజూ పొద్దున్నే ప్రాణాయామం చేయాలి.

గోరు వెచ్చని నీటిలో యూకలిప్టస్‌ ఆయిల్‌ 5 డ్రాప్స్‌ వేసి ఆవిరిని పీల్చాలి.

ఛాతిపై డైలీ ఆముదంతో మర్దనా చేసుకోవాలి.

ఈ విధంగా చేస్తే ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి.

శుభ్రం చేసుకోవడమే కాదు, ఊపిరితిత్తులని అనారోగ్యం నుండి కాపాడుకోవడం కూడా ముఖ్యమే.

ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహరం తీసుకోవాలి.

ఆయిల్ ఫుడ్ తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.

ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.