దేశంలో మోసగాళ్లకు కొదవలేదు. అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించేందుకు అమాయకుల్ని మోసం చేస్తున్నారు

లిక్కన్ బారన్ విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, మెహుల్ ఛోక్సీ, ఐపిఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ  వంటి ఆర్థిక నేరగాళ్లు.. 

ఇక్కడ బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పరారయ్యారు.

ప్రజల విశ్వాసంతో ఆడలాడుతూ.. పబ్బం గడుపుకుంటున్నాయి కొన్ని మోసపూరిత కంపెనీలు

చిట్ ఫండ్ కంపెనీలు పెట్టి.. సామాన్యులకు నుండి కోట్లాది రూపాయలు కొల్లగొట్టి.. ఆ తర్వాత బోర్డు తిప్పేస్తున్న కంపెనీలు అనేకం ఉన్నాయి

ఇవి ప్రతి రాష్ట్రంలో జరుగుతున్న మోసాలే. అయితే ఇటువంటి చీటింగ్ కేసుల్లో నేరస్థులకు శిక్షలు పడటం అరుదు.

కానీ ఓ చీటింగ్ కేసులో చారిత్రాత్మక తీర్పునిచ్చింది మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లా కోర్టు

సాయి ప్రసాద్ చిట్ ఫండ్ కంపెనీ పేరుతో కోట్లు వసూలు చేసి.. ప్రజలకు మోహం చాటేసిన సంస్థ యాజమానికి ఏకంగా 250 ఏళ్ల జైలు శిక్ష విదించింది. 

అంతే కాకుండా అతడికి రూ. 6.50 లక్షల జరిమానా విధించింది.

ఈ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా 10 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. 

5 ఏళ్లల్లో రెండింతలు  డబ్బులు వస్తాయన్న ఆశతో వాళ్ల మాయ మాటలు నమ్మి అనేక మంది ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టారు.

డబ్బులు చెల్లించే సమయానికి సంస్థకు తాళం వేసి పరారయ్యారు యజమాని, ఉద్యోగులు.. దీంతో మోసపోయామని బాధితులు గుర్తించారు. 

2009 నుండి 2016 వరకు ఈ మోసాలకు పాల్పడగా.. యజమాని భాస్కర్ పై కేసు నమోదు అయ్యింది. పోలీసులు అరెస్టు చేశారు.

దీనిపై విచారణ చేపట్టిన సెహోర్ జిల్లా కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి సంజయ్ కుమార్ షాహితో కూడిన ఏక సభ్య ధర్మాసనం ఈ  తీర్పునిచ్చింది.