మెగాస్టార్ చిరంజీవి మెగా ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్ చెప్పారు. ఎంతో కాలంగా మెగా అభిమానులు వినాలి అనుకుంటున్న శుభవార్తను ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

ఇంతకీ ఏంటా గుడ్ న్యూస్ అనేగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – సతీమణి ఉపాసన త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. అవును.. స్వయంగా మెగా స్టార్ చిరు ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించారు.

ఆ హనుమంతుడి కృపతో తనయుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన  త్వరలోనే తమ మొదటి బిడ్డకు జన్మనివ్వనున్నారని చిరు ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో ఈ విషయం మెగా అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు.. 2012లో వివాహం చేసుకున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారని తెలిసి ఇరు కుటుంబాలతో పాటు ఫ్యాన్స్ కూడా ఆనందిస్తున్నారు.

ఎప్పటినుండో ఫ్యాన్స్ ఈ వార్త వినాలని వెయిట్ చేస్తున్నారు.. కానీ, చరణ్ – ఉపాసన ఇన్నాళ్లు పెద్దగా స్పందించలేదు. పైగా ఇద్దరూ ఏదొక రోజు గుడ్ న్యూస్ చెబుతామని చెబుతూ వచ్చారు.

ఇప్పుడు ఏకంగా సర్ప్రైజ్ చేసేశారు. మరి మెగా ఫ్యామిలీలో మరో మినీ స్టార్ ఎవరు రాబోతున్నారో చూడాలి. కాగా.. రామ్ చరణ్, ఉపాసన ఇద్దరూ పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు.

అపోలో హాస్పిటల్స్ చైర్మన్ కామినేని ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసన. పెళ్లి తర్వాత అటు అపోలో హాస్పిటల్స్, ఇటు కోడలిగా మెగా ఫ్యామిలీ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వరిస్తూ వస్తున్నారు. ఎల్లప్పుడూ స్వచ్చంధ సేవలలో కూడా యాక్టీవ్ గా ఉంటారు ఉపాసన.

ఇక రామ్ చరణ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ అందుకున్న చరణ్.. ప్రస్తుతము డైరెక్టర్ శంకర్ తో తన 15వ సినిమా చేస్తున్నారు.

ఇదికూడా పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. మరి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలోకి పాపనో, బాబో రాబోతున్నారు.. కాబట్టి, ఈ మూమెంట్ మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీకి కూడా ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి.