గత కొన్ని రోజుల నుండి ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 75 శాతం ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకినట్లు వైద్యులు చెబుతున్నారు.
అయితే.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా.. నేనున్నాను అంటూ అభయ హస్తం అందించే మెగాస్టార్ చిరంజీవి తాజాగా శివ శంకర్ మాస్టర్ కి ఆర్థిక సాయం అందించారు.
శివ శంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న చిరంజీవి ఆయన కుటుంబ సభ్యులకి దైర్యం చెప్పారు.
ఇక శివ శంకర్ మాస్టర్ తో చిరంజీవి అనుబంధం ఈనాటిది కాదు. చిరంజీవి యాక్ట్ చేసిన చాలా సినిమాలకి మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పని చేశారు.
ఇక.. రామ్ చరణ్ కెరీర్ ని నిలబెట్టిన మగధీర మూవీలో.. ధీర ధీర పాటకి గాను శివ శంకర్ మాస్టర్ జాతీయ అవార్డు అందుకోవడం విశేషం.
మరి… ఇలాంటి లెజండ్రీ డ్యాన్స్ మాస్టర్ ని కాపాడుకోవడానికి చిరంజీవి చేసిన ఈ సహాయం నిజంగా అభినందనీయం.