ఆకు కూరలు పిల్లల బ్రైయిన్‌కు చాలా అవసరం. పాలకూర, బచ్చలికూర, కాలే వంటి ఆకు కూరల్లో మెదడును రక్షించే ఫ్లేవనాయిడ్లు, విటమిన్ ఈ, కె 1 వంటి పోషకాలు ఉంటాయి
ఆకుకూరల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మెదడు, పేగులలో వాపు తగ్గుతుంది.
జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్‌నట్స్ వంటి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
విటమిన్-ఇ శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని (ఆక్సిడేటివ్ స్ట్రెస్) నిరోధిస్తుంది.
వాల్‌నట్స్‌లో విటమిన్ బి6, మెగ్నీషియం ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
వాల్ నట్స్ పిల్లల మెదడును సురక్షితంగా ఉంచడంతో పాటు జ్ఞాపకశక్తిని పెంచడంలోనూ సహాయపడతాయి.
యాపిల్స్‌పై ఉండే తొక్కలో జ్ఞాపకశక్తిని పెంచే క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది.
దానిమ్మ...వంటి సిట్రస్ జాతికి చెందిన పండ్లను తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తిని బాగా పెంచుకోవచ్చు.