ఈ ప్రపంచంలో అన్నిబంధాలలో స్నేహం బంధం చాలా ప్రత్యేకమైనది.
ఈ ప్రపంచంలో అన్నిబంధాలలో స్నేహం బంధం చాలా ప్రత్యేకమైనది.
మనకు ఎందుకంటే అమ్మనాన్న, తొబుట్టువులను ఎంచుకునే అవకాశం లేదు.
అయితే స్నేహితుడ్ని మాత్రం ఎంచుకునే అవకాశం మనకు ఉంది.
కష్టసుఖాల్లోనూ నేనున్నాను అంటూ ముందుడే వాడే స్నేహితుడు.
స్నేహం కోసం ఎన్నో త్యాగాలు చేసిన, పోరాటలు చేసిన వారు ఎందరో ఉన్నారు.
తాజాగా మరోసారి స్నేహం విలువను తెలియజేసే ఘటన ఒకటి ఒడిశాలో చోటుచేసుకుంది.
ఒడిశాలోని సుందర్ గఢ్ జిల్లా కుసుముండి చెందిన ముంగిరి బడా(9), జయసికా బడా(8) అనే చిన్నారులు మంచి స్నేహితులు.
ఓ ప్రభుత్వ పాఠశాలలో ముంగిరా ఐదో తరగతి చదువుతుండగా ఆమె ఫ్రెండ్ కి పోలీయో సోకడంతో ఇంట్లోనే ఉండేది.
ఈ బాల స్నేహితులు ఇద్దరూ నిత్యం తమ ఇళ్ల వద్ద ఎంతో సంతోషంగా ఆడుకునేవారు.
ఈ క్రమంలో పాఠశాలకు రావాలని ఉందని జయసికా.. తన మనస్సులోని మాటను చెప్పింది.
దీంతో స్నేహితురాలి మాటలు అర్థం చేసుకున్న ముంగిరా మనస్సు కలచివేసింది.
తన స్నేహితురాలిని ఎలాగైన బడికి తీసుకెళ్లాలని ముంగిరా నిర్ణయించుకుంది.
ముంగిరా తన చదివే పాఠశాలలోనే ఒకటవ తరగతిలో జయసికాను జాయిన్ చేసింది.
తన స్నేహితురాలు జయసికాను భుజంపై అరకిలోమీటర్ దూరంలో ఉన్న పాఠశాలకో రోజు తీసుకెళ్తుంది.
స్నేహితురాలిపై ముంగిరి చూపిన ప్రేమకు ఆ స్కూల్ ఉపాధ్యాయులు చాలా సంతోష పడ్డారు.
స్నేహం కోసం పట్టుమని పదేళ్లులేని ఈ చిన్నారి చేసిన పనికి అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.