పిల్లలు ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు

పిల్లల ఆరోగ్యం కోసం అనేక రకాల ఆహార పదార్ధాలు తయారు చేస్తుంటారు.

అయితే పిల్లలను ఆరోగ్యంగా, దృఢంగా ఉంచటంలో చియ సీడ్స్ ఎంతో ఉపయోగపడుతుంది.

పిల్లల‌ చియా సీడ్స్  తినడం వ‌ల్ల కలిగే ప్రయోజ‌నాల‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చిన్నారులకు కాల్షియం చాలా అవసరం. అది ఎక్కువ గా ఉన్న చియా సీడ్స్ తినిపించాలి.

రాత్రి పూట గుప్పెడు చియా గింజలను నీటిలో నాన బెట్టి తరువాతి రోజు ఉద‌యం పిల్లల‌కు  తినిపించాలి. 

ఇలా వారంలో రెండు సార్లు తినిపిస్తే చాలు.. పిల్లలకి కాల్షియం బాగా ల‌భిస్తుంది. 

పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరిగెందకు చియా సిడ్స్  ఎంతగానో ఉపయోగపడతాయి.

చియా గింజల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు చిన్నారుల్లో జ్ఞాప‌క‌శ‌క్తి, ఏకాగ్రతను పెంచుతాయి. 

చియా సీడ్స్‌ను పిల్లల‌కు తినిపించడం వ‌ల్ల వారిలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

ద‌గ్గు, జ‌లుబు, జ్వరం వంటి సీజ‌న‌ల్ వ్యాధులు రాకుండా చియా సీడ్స్ తో అడ్డుకోవ‌చ్చు. 

చిన్నారుల‌కు చియాసీడ్స్‌ను అనేక రకాలుగా తినిపించ‌వ‌చ్చు. 

నీటిలో నాన‌బెట్టి, అలాగే పెరుగులో వాటిని క‌లిపి లేదా వాటి పొడిని క‌లిపి ఇవ్వవ‌చ్చు. 

వారంలో రెండు సార్లు  చియా సీడ్స్‌ను  పిల్లలు తింటుంటే ఇలా అనేక ప్రయోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.