చాలా మంది శరీరంలోని అన్ని అవయవాలు బాగుండి.. జీవితంలో ఎదురయ్యే కష్టాలకు భయపడతున్నారు.
కొందరు ఒకటి, రెండు అపజయాలు చూడగానే తీవ్ర నిరాశలోకి వెళ్లిపోతారు.
ఇలా మానసిక సంఘర్షణకు లోనయ్యవారు.. ఓ యువకుడిని ఆదర్శంగా తీసుకోవాలి.
తన తల్లి పడుతున్న బాధను, కష్టాలను చూసి.. వాటిని తొలగించాలని భావించాడు.
ఛత్తీస్‌గఢ్ లోని సుర్గుజా జిల్లాకు చెందిన మహేశ్ సింగ్ అనే 17 ఏళ్ల బాలుడు తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు.
అతడికి ఫోకోమెలియా అనే అరుదైన వ్యాధితో కాళ్లు, చేతులు సరిగ్గా పనిచేయవు.
మహేశ్ చిన్నతనంలోనే తండ్రి చనిపోయినా.. అతడి తల్లి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని సాకుతోంది.
మహేశ్ తల్లి వ్యవసాయ పనులు చేస్తూ వచ్చిన ఆదాయంతో కుమార్తెల పెళ్లి చేసింది.
బాగా చదువుకుని తల్లిని సుఖంగా చూసుకోవాలని మహేశ్ భావించాడు.
అంగవైకల్యం కారణంగా తాను చేతులతో రాయలేకపోయేవాడు.
పాఠశాలకు వెళ్లిన తొలి రోజు నుంచే మహేష్ కాలితో రాయడం మొదలు పెట్టాడు.
ఇలా ఒక్కొక్క తరగతిని చదువుతూ ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్నాడు.
ఇటీవలే ఎడమ కాలితో బోర్డ్ ఎగ్జామ్స్ రాసిన మహేశ్ 80 శాతం మార్కులు వస్తాయని ధీమా వ్యక్తం చేశాడు.
అలానే వీలైనంత త్వరగా హిందీ ఉపాధ్యాయుడిని కావాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
తన కలను సాకారం చేసుకోవడానికి ప్రభుత్వం కూడా సహాయం చేస్తుందని ఆశిస్తున్నట్లు మహేశ్ తెలిపారు.