గైక్వాడ్ పూర్తి పేరు ఋతురాజ్ దశరద్ గైక్వాడ్. అందరూ ముద్దుగా ఇతన్ని మాన్సి అని పిలుస్తారు.

గైక్వాడ్ 1997 జనవరి 31న మహారాష్ట్రలోని పూణే నగరంలో జన్మించాడు.

తండ్రి పేరు దశరద్ గైక్వాడ్. ఈయన ఒక డిఫెన్స్ రీసర్చ్ డెవలప్మెంట్ ఆఫీసర్.  తల్లి పేరు సవితా గైక్వాడ్. ఈమె స్కూల్ టీచర్.  

 గైక్వాడ్ కేవలం 5 ఏళ్ళ వయసులోనే క్రికెట్ ఆటపై ఆసక్తి చూపించాడు. కానీ.., అప్పటికి ఆటని సీరియస్ గా తీసుకోలేదు.

మ్యాచ్ లను గ్రౌండ్ కి వెళ్లి వీక్షించడం గైక్వాడ్ కి ఇష్టం. ఇలా 6 ఏళ్ళ వయసులో బ్రెండన్ మెక్ కల్లమ్ ఆట చూసి గైక్వాడ్ ముగ్ధుడు అయిపోయాడు. అప్పటి నుండి క్రికెట్ ని సీరియస్ గా తీసుకున్నాడు. 

గైక్వాడ్ లోకల్ కోచ్ ల చేతుల్లో మెరుగై.. 11 ఏళ్ళ వయసుకే వెంగ్ సర్కార్ క్రికెట్ అకాడమీలో స్థానం దక్కించుకున్నాడు.

 వెంగ్ సర్కార్ క్రికెట్ అకాడమీ గైక్వాడ్ ని ప్రొఫెషనల్ ప్లేయర్ గా తీర్చిదిద్దింది. దీంతో.., అండర్-14, అండర్-16 జట్లలో గైక్వాడ్ స్థానం దక్కించుకున్నాడు.

2014 లో గైక్వాడ్ అండర్-19 జట్టుకి ఎంపిక అయ్యాడు. ఆ సీజన్ లో గైక్వాడ్ పరుగుల వరద పారించాడు. కేవలం 6 మ్యాచ్ లలోనే 826 పరుగులు సాధించి సెలక్టర్స్ ని సైతం ఆశ్చర్యపరిచాడు. 

2014 లోనే జరిగిన మహారాష్ట్ర ఇన్విటేషన్ టోర్నమెంట్ లో తనకన్నా సీనియర్ బౌలర్స్ ని ఎదుర్కొని అవలీలగా ట్రిపుల్ సెంచరీ బాదేశాడు గైక్వాడ్.

ఈ ఇన్నింగ్స్ తో గైక్వాడ్ అండర్-19 వరల్డ్ కప్ ప్రాబబుల్స్ కి సెలక్ట్ అయ్యాడు. కానీ.., ప్రధాన జట్టులో మాత్రం స్థానం దక్కలేదు.

ఆ తరువాత జరిగిన కోచ్ బీహార్ టోర్నీలో 7 మ్యాచ్ లలోనే 875 పరుగులు చేసి సెలక్టర్స్ తన స్థాయి ఏమిటో చాటి చెప్పాడు. 

 గైక్వాడ్  2016 లో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లోకి డెబ్యూ ఇచ్చాడు. 2016 అక్టోబర్ 6వ తేదీన జార్ఖండ్ తో జరిగిన ఆ మ్యాచ్ లో అరుణ్ వరుణ్ బౌలింగ్ లో తీవ్రంగా  గాయపడ్డాడు గైక్వాడ్. దీంతో.. సంవత్సరం పాటు ఆటకి దూరం అయ్యాడు.

2017 లో మళ్ళీ తిరిగొచ్చి పరుగుల వరద పారించిన గైక్వాడ్.. లిస్ట్-ఏ మ్యాచ్ లలో ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడ కూడా గైక్వాడ్ పరుగుల దాహం కొనసాగింది.

ఇలా రెండేళ్ల పాటు.. నిలకడగా రాణించడంతో 2019 లో జరిగిన ఆక్షన్ లో చెన్నై జట్టు గైక్వాడ్ ని కేవలం 20 లక్షలకి సొంతం చేసుకుంది. 

ఆ తర్వాత ఏడాది అనగా 2020లో గైక్వాడ్ ఇండియా-ఏ టీమ్ కి ఎంపిక అయ్యాడు. 

ఐపీఎల్ 2020 సీజన్ లో చెన్నై టీమ్  దారుణంగా విఫలం అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఋతురాజ్ గైక్వాడ్ కి కొన్ని అవకాశాలు లభించాయి. 

మొదట్లో కొన్ని మ్యాచ్ లలో తడబడిన ఋతురాజ్..  తరువాత వరుస హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయాడు. 

ఐపీఎల్ 2021 సీజన్ చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలవడం ఋతురాజ్ దే కీలక పాత్ర. ఈ సీజన్ లో ఋతురాజ్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా నిలవడం విశేషం. 

ఇప్పుడు బీసీసీఐ ఫ్రాంచైజీలు అన్నీ ఋతురాజ్ ని దక్కించుకోవాలని తాతలాడుతున్నాయి. రానున్న మెగా ఆక్షన్ లో ఋతురాజ్ పై కాసుల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇవన్నీ కాక.. త్వరలోనే ఋతురాజ్ టీమిండియాలో కూడా స్థానం సంపాదించడం ఖాయంగా కనిపిస్తోంది.