చెడ్డీ గ్యాంగ్.. ఈ పేరు వినగానే చాలా మంది భయంతో వణికిపోతారు.

అసలు ఎవరీ ఈ చెడ్డీ గ్యాంగ్? వీరు ఎలా పుట్టుకొచ్చారు. వీరి చరిత్ర ఏమిటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

అసలు చెడ్డీ గ్యాంగ్ పుట్టింది గుజరాత్ లోని ధవోద్ జిల్లాలోని గూద్ బాలా తాలూకాలో ఉన్న.. నహేడా అనే గిరిజన గ్రామంలో.

 మొదట్లో వీరు ఎలాంటి దొంగతనాలు చేయలేదు. కానీ.., తరువాత కాలంలో ఈ తెగని కరువు ముంచేసింది. అడవిలో వేటపై ప్రభుత్వం నిషేధం విధించింది.

దీంతో.. చెడ్డీ గ్యాంగ్ 1987 నుండి దొంగతనాలు చేస్తూ వస్తోంది.

 తెగ పెద్ద రాంజీ ఒక 5 మంది కుర్రాళ్ళతో చెడ్డీ గ్యాంగ్ ని తయారు చేశాడు. 

ప్రతి చెడ్డీ గ్యాంగ్ కూడా గురువు రాంచీ చెప్పిన  సూత్రాలనే పాటిస్తూనే.. ఇప్పటికీ దొంగతనాలు చేస్తోంది.

 చెడ్డీ గ్యాంగ్ లోని సభ్యులు పగటి వేళల్లో  బిక్షాటన చేస్తూ.., బెలూన్స్, పక్క పిన్నీసులు అమ్ముతూ..  ఇళ్లపై రెక్కీ నిర్వహిస్తారు.

అంతా గాఢ నిద్రలోకి జారుకునే సమయమైన  3 గంటల ప్రాంతంలో వీరి అటాక్ మొదలవుతుంది.

 చెడ్డీ గ్యాంగ్ చాలా వరకు మనుషుల మీద అటాక్ చేయరు. ఒకవేళ ఎదురు తిరిగితే మాత్రం విచక్షణ లేకుండా దాడి చేస్తారు.

చేతికి డబ్బు వచ్చాక.. వీరంతా ఆ డబ్బుని పంచుకుని.. విడి విడిగా మాత్రమే తమ సొంత ఊరిని చేరుకుంటారు.

పొరపాటున వీరిలో ఏ ఒక్కరు దొరికినా.. మిగతా వారి ఆచూకీ మాత్రం చెప్పరు.

చెడ్డీ గ్యాంగ్ లోని ఒక్కో గ్రూప్ లో  6 నుండి 8 మంది సభ్యులు ఉంటారు.

ఇప్పుడు వీరి టార్గెట్ ఆంధ్రప్రదేశ్ అయ్యింది. 

 ఇప్పటికే విజయవాడ పోలీసులు చెడ్డీ గ్యాంగ్ ఫోటోలను విడుదల చేశారు.