దేశంలో ఇప్పుడు ఏ పని చేయలన్నా ఆధార్ తప్పనిసరి అయింది. పాన్ కార్డ్, రేషన్ కార్డు, పాస్ పోర్టు, బ్యాంక్ లోన్లు ఇలా ప్రతి అంశమూ ఆధార్ తోనే ముడిపడింది.
ఈ కార్డులో మన వ్యక్తిగత సమాచారం మొత్తం నిక్షిప్తమై ఉంటుంది. ఈ క్రమంలో మనం ఎక్కడపడితే అక్కడ ఆధార్ ను ఇస్తుంటాం.
అయితే.. మన ఆధార్ ను ఎవరైనా దుర్వినియోగపరిచారా అన్న సందేహం రావచ్చు. అలాంటి సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఆధార్ కార్డు జారీ చేసే సంస్థ యూఏడీఏఐ ఒక అవకాశాన్ని కల్పిస్తోంది.
ఈ క్రింది స్టెప్స్ పాటించడం ద్వారా మీ ఆధార్ క్కడెక్కడ వాడారో తెలుసుకోవచ్చు.
స్టెప్ 1: ఈ సమాచారం కావాలనుకున్నవారు ముందుగా యూ.ఐ.డీ.ఏ.ఐ సైట్ ని ఓపెన్ చేయండి. అందులో ‘My Aadhaar’ ఆప్షన్ పై డ్రాప్‌డౌన్ క్లిక్ చేస్తే ‘Aadhaar Services’ సెక్షన్ లో Aadhaar Authentication History పై క్లిక్ చేయాలి.
స్టెప్ 2: అక్కడ మీకు కనిపించే పేజీలో మీ ఆధార్ నంబర్, కాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. జనరేట్ ఓటీపీ క్లిక్ చేస్తే.. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి.
స్టెప్ 3: తరువాత కొన్ని ఆప్షన్స్ డిస్ ప్లే అవుతాయి. బయోమెట్రిక్, డెమొగ్రాఫిక్ లాంటివి. అందులో మీకు కావలసిన ఆప్షన్ ను ఎంచుకొని డేట్స్ ఎంటర్ చేయాలి. (ప్రస్తుత తేదీ నుంచి గరిష్ఠంగా ఆరు నెలల కిందటి వరకు డేట్స్ ఎంటర్ చేయాలి). మొత్తం ఎన్ని రికార్డ్స్ చూడాలనుకుంటున్నారో టైప్ చేయాలి.
స్టెప్ 4: అన్ని వివరాలు ఎంటర్ చేశాక చివరి కాలంలో ఓటీపీ ఎంటర్ చేసి సబ్ మిట్ చేస్తే మొత్తం డీటెయిల్స్ వస్తాయి. మీరు ఏ రోజు, ఏ సమయానికి, ఎలాంటి పని కోసం ఆధార్ ఇచ్చారన్న వివరాలు కనిపిస్తాయి.
ఆ రికార్డ్‌ను మీరు డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసిన ఫైల్ ఓపెన్ చేయాలంటే మీ పేరులోని మొదటి 4 లెటర్స్ అప్పర్‌కేస్‌లో టైప్ చేసి మీరు పుట్టిన సంవత్సరాన్ని కలిపి పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి.
మీ ఆధార్ నెంబర్‌ను మీకు తెలియకుండా వాడినట్టు అనుమానం వస్తే 1947 నెంబర్‌కు కాల్ చేసి లేదా help@uidai.gov.in ఇమెయిల్ ఐడీకి కంప్లైంట్ చేయొచ్చు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.