చలికాలంలో దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ.

ఆకుకూరలు తింటే రోగనిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. 

ముఖ్యంగా ఈ చలికాలంలో మెంతికూర తప్పకుండా తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

మెంతి ఆకుల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, క్యాల్షియం, సెలీనియం, పొటాషియం, మాంగనీస్ అధికంగా ఉంటాయి.

మెంతికూర శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది, బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. 

మెంతి ఆకుల్లో ఫైబర్ అధికంగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. 

మెంతికూర తినడం వల్ల ఊబకాయం అదుపులో ఉంటుంది.

మెంతికూర తినడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి.

మెంతి ఆకుల్లో ఉండే ప్రోటియోమ్ ఎముకలను బలంగా ఉంచి కీళ్ల నొప్పులు రాకుండా ఉంచుతుంది.

మెంతి ఆకులను గ్రైండ్ చేసి జుట్టుకు అప్లై చేస్తే జుట్టు నల్లగా మెరుస్తుంది. జుట్టు బలంగా, ఒత్తుగా కూడా పెరుగుతుంది.

మెంతి ఆకుల్లో ఉండే మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

మెంతికూర తినడం వల్ల చర్మంపై మచ్చలు తగ్గుతాయి.

తరచూ మెంతి ఆకులు తింటే మొఖం మీద మొటిమలు తగ్గుతాయి.