చెర్రీ పండ్లు అంటే ఇష్టపడని వారు ఉండరు. అయితే వీటిని ఎక్కువగా తినేందుకు ఆసక్తి చూపించరు.

కానీ ఈ చెర్రీ పండ్ల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

అవేంటో తెలుసుకుంటే మీరు అసలు వదిలిపెట్టరు.

నిద్రలేమితనం డిప్రెషన్, గుండె సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది. చెర్రీ పండ్లను తినడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది.

చెర్రీ పండ్ల జ్యూస్ వల్ల నిద్ర బాగా పడుతుంది. చెర్రీ జ్యూస్ నిద్రకు కావాల్సిన మెలటోనిన్ ని మెరుగుపరుస్తుంది. 

చెర్రీ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. ఫ్రీ రాడికల్స్ ఆక్సీకరణ ఒత్తిడిని పెంచుతాయి.

దీని వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటివి వస్తాయి. రోజూ గుప్పెడు చెర్రీ పండ్లు తినడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది.

శరీరం ఎరుపెక్కడం, ఉబ్బడం, వేడెక్కడం, తరచుగా నొప్పి రావడం, ముఖ్యంగా గాయం లేదా ఇన్ఫెక్షన్ అవ్వడం వంటి ఇన్ఫ్లమేటరీ సమస్యలకు చెర్రీ పండ్లు చక్కని పరిష్కారం చూపిస్తాయి.

ఇన్ఫ్లమేటరీ సమస్య పెరిగితే కీళ్ల నొప్పులు, మధుమేహం, తీవ్రమైన మంట, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి రోగాలకు దారి తీస్తుంది. 

చెర్రీ పండ్లు తినడం వల్ల ఇన్ఫ్లమేటరీ సమస్య తగ్గుతుంది.

చెర్రీ పండ్లలో ఉండే పొటాషియం, పాలీఫెనాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

చెర్రీ పండ్లతో మైగ్రేన్, తలనొప్పిసమస్యలకు చెక్ పెట్టవచ్చునని నివేదికలు చెబుతున్నాయి.

చెర్రీ పండ్లు కంటి ఆరోగ్యానికి మంచివి. వృద్ధులకు వచ్చే కంటి వ్యాధుల్లో గ్లకోమా ఒకటి

ఇది అంధత్వానికి దారి తీస్తుంది. దీని వల్ల దృష్టి నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. చెర్రీ పండ్లలో లోగానిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కంటి లోపల పీడనాన్ని తగ్గిస్తుంది. 

చెర్రీ పండ్లతో మలబద్ధకాన్ని తగ్గించుకోవచ్చు. చెర్రీలలో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

వ్యాయామం చేసిన తర్వాత చెర్రీ పండ్లను తింటే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

అథ్లెట్లు టార్ట్ చెర్రీ జ్యూస్ లేదా టార్ట్ చెర్రీ పౌడర్ తీసుకోవడం మంచిది. 

ఇవి వ్యాయామం చేసిన తర్వాత కలిగే నొప్పిని, కండరాల తిమ్మిరిని తగ్గిస్తుంది.

గమనిక: ఈ చిట్కాను పాటించే ముందు వైద్యులు, నిపుణుల సలహా తీసుకోవాల్సిందిగా మనవి.