వారంలో రెండు సార్లు చేపల కూర తింటే కీళ్ల నొప్పులు, వాపు సమస్యలు తగ్గుతాయి.

సాల్మన్, ట్యూనా చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి తినడం వల్ల నొప్పులు తగ్గుతాయి.

చేపలు మరియు చేప ఉత్పత్తుల్లో ఉండే విటమిన్ డి డైట్ చేసే వారికి ప్రయోజనం చేకూరుస్తుంది.

సాల్మన్, హెర్రింగ్ చేపల్లో విటమిన్ డి అధికంగా ఉంటుంది. కాడ్ లివర్ ఆయిల్ వంటి కొన్ని చేపల నూనెలో విటమిన్ డి ఎక్కువ శాతం ఉంటుంది.

ఒక టేబుల్ స్పూన్ చేప నూనెలో 200 శాతం కంటే ఎక్కువ మోతాదులో విటమిన్ డి దొరుకుతుంది.

చేపల్లో ఉండే ఒమేగా 3 లేదా చేప నూనె పిల్లల్లో టైప్ 1 డయాబెటిస్ ని రాకుండా నిరోధిస్తాయి.

అదే విధంగా పెద్దల్లో డయాబెటిస్ కారకాలను నిరోధిస్తాయి.

చేపలు తినడం వల్ల పిల్లలకు ఆస్తమా రాకుండా ఉంటుంది. చేపలు తింటే వృద్ధాప్యంలో కంటిచూపు మెరుగ్గా ఉంటుంది.

చేపలు తినడం వల్ల గుండెపోటు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి.

చేపలు ఎక్కువ తినే వారికి మానసిక సమస్యలు వచ్చే అవకాశం తక్కువ. చేపలు తినడం వల్ల డిప్రెషన్ రాకుండా నియంత్రించవచ్చు.

వారానికొకసారి చేపలు తినడం వల్ల బ్రెయిన్ యొక్క మేజర్ కణజాలం బాగా పని చేస్తుంది. భావోద్వేలని నియంత్రించి.. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

వారంలో 3 సార్లు సాల్మన్ చేపలు తింటే నిద్ర బాగా పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

చేపలు తినని వారు అవిసె గింజలు, బాదం పప్పు, వాల్ నట్స్, పొద్దు తిరుగుడు గింజలు తింటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. 

విటమిన్ సి ఉండే పండ్లు తింటే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.