పురాణాలు, సంప్రదాయాలు, ఆచారాల ప్రకారం.. మన దేశంలో సూర్య, చంద్ర గ్రహణాలను చెడుగానే భావిస్తారు.

అందులోనూ ఈ రెండు గ్రహణాలు నెల రోజుల వ్యవధిలో ఏర్పడితే.. ఫలితాలు కాస్త తీవ్రంగా ఉంటాయనే అంటున్నారు ఆధ్యాత్మిక వేత్తలు. 

మన దేశంలో చంద్రగ్రహణంమంగళవారం సాయంత్రం 5:32 గంటలకు ప్రారంభమయ్యి.. సాయంత్రం 6:18 గంటలకు ముగుస్తుంది. 

సాధారణంగా గ్రహణం ఏర్పడే సమయానికి తొమ్మిది గంటల ముందే సూతకాలం ప్రారంభమవుతుంది. 

గ‍్రహణాలను చెడుగా భావిస్తారు కనుక.. గ్రహణ సమయంలో, సూతకాలంలో కూడా కొన్ని పనులు అస్సలు చేయకూడదు అంటారు. అవేంటంటే..

సూతకాలం మొదలైన తర్వాత ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. అలా చేస్తే.. మంచి ఫలితాలు రాకపోగా.. అరిష్టం అని కూడా అంటారు.

ఈ సమయంలో చాలా దేవాలయాలు కూడా మూసి ఉంటాయి. కనుక ఆలయాలు వెళ్లడం వంటి పనులు మానుకోవాలి. 

అయితే కొన్ని ప్రత్యేకమైన దేవాలయాలను మాత్రం వాటి వాటి స్థలమహాత్యం అనుగుణంగా తెరిచి ఉంచుతారు.

గ్రహణ సమయంలో ఎలాంటి ఇంట్లో ఎలాంటి ఆహార పదార్థాలు తయారు చేయకూడదు.. తిన కూడదు. 

అయితే చిన్నపిల్లలు, ముసలివాళ్లు, గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవాళ్లకు ఈ నియమం వర్తించదు.

గ్రహణసమయంలో నిద్రపోకూడదు.. ప్రయాణాలు చేయకూడదు.

గ్రహణం వేళ గర్భిణిలు మరింత జాగ్రత్తగా ఉండాలి. పుట్టబోయే బిడ్డపై దీని ప్రభావం పడకూడదు కనుక ఈ గ్రహణ సమయంలో బయటకి వెళ్లకూడదు.

అలాగే గ్రహణం విడిన తర్వాత ఇంటిని శుభ్రం చేసి, తలస్నానం చేసి మళ్లీ శుచిగా ఆహారాన్ని వండుకుని తినాలి.

గ్రహణ సమయంలో ఇంట్లో నిలువ ఉండే పదార్థాలపై దర్భలను వేసి ఉంచాలి.

ఇక ఈ గ్రహణ సమయంలో జపం చేసుకుంటూ ఉండడం చాలామంచిది అంటున్నారు ఆ‍ధ్యాత్మికవేత్తలు.

దైవధ్యానం వల్ల మానసిక ప్రశాంతతో పాటూ, గ్రహణం వల్ల ఏర్పడే దుష్ప్రభావాల నుంచి కూడా తప్పించుకోవచ్చు.

పైగా ఈ సమయంలో జపం చేయడం వల్ల అధిక ఫలం లభిస్తుంద అంటున్నారు.

కనుక గ్రహణ సమయంల ఈ జాగ్రత్తలు పాటించి.. జాగ్రత్తగా ఉంటే మేలు అంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు.