నేటికాలంలో ఎక్కువ మంది ఉద్యోగాల కంటే  వ్యాపారంపైనే ఆసక్తి ఉంటుంది.

అలాంటి వారికోసం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చింది.

వ్యాపారం చేయాలనుకునే వారు సున్న వడ్డీతో రూ.3 లక్షల వరకు లోన్ పొందవచ్చు.

అంతేకాక ఈ రుణంలో  50 శాతం వరకు సబ్సిడీ కూడా లభిస్తుంది.

అయితే పథకంలో కేవలం మహిళలకు మాత్రమే లోన్ ఇస్తారు.

ఈ  పథకం కింద మీరు మీ దగ్గర్లో ఉన్న ఏ బ్యాంకుకైనా వెళ్లి అప్లై చేసుకోవచ్చు.

ఎలాంటి హామీని కూడా చూపించాల్సిన లేకుండానే  రూ.3 లక్షల వరకు రుణం లభిస్తుంది.

25 నుంచి 55 ఏళ్ల వయసు  ఉన్న మహిళలు  మాత్రమే ఈ రుణం కోసం అప్లయ్ చేసుకోవాలి.

కేంద్రం ఇచ్చే ఈ పథకంలో 88 రకాల వరకు వ్యాపారల కోసం మహిళలు లోన్ తీసుకోవచ్చు.

ఈ పథకంలో జీరో వడ్డీ, సబ్సిడీ అందరికీ ఇవ్వరు.

ఎస్సీ, ఎస్టీ, హ్యాండీక్యాప్డ్‌ మహిళలకు మాత్రమే ఈ సున్నా వడ్డీ లభిస్తుంది.

అలానే సబ్సిడీ వితంతువు, హ్యాండీక్యాప్డ్ మహిళలకు 30 శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది.

 మీరు కట్టాల్సిన రుణంలో 30 శాతం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.

రుణం తీర్చేందుకు  ఆరు ఏళ్ల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు.