ప్రేమించే మనసు ఉండాలి.. 

పెళ్లికి వయసు తో సంబంధం ఏంటీ?

ఒకప్పుడు  అబ్బాయి కంటే అమ్మాయి వయసు

తక్కువగా ఉండాలనే వారు. కానీ ఈ కాలంలో 

అలాంటి తేడాలు పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఇలా సినిమా ఇండస్ట్రీలో తమ 

 కన్నా ఎక్కువ వయసున్న వారిని వివాహం

చేసుకుని సక్సెస్ జీవితాన్ని గడుపుతున్న

సెలబ్రెటీల గురించి తెలుసుకుందాం.

తెలుగు ఇండస్ట్రీలో లవబుల్ కపుల్ గా 

పిలవబడే సూపర్ స్టార్ మహేష్ బాబు- నమ్రత

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

అయితే మహేష్ కంటే నమ్రత

రెండున్నరేళ్లు పెద్ద. ఇండస్ట్రీ ఎంట్రీ తర్వాత 

ఐదేళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.

బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్

తనయుడు అభిషేక్ బచ్చన్, మాజీ

ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ ని ప్రేమించి 

పెళ్లి చేసుకున్నారు.

అభిషేక్ బచ్చన్ కన్నా ఐశ్వర్యరాయ్

రెండేళ్లు పెద్ద. ప్రస్తుతం వీరిద్దరూ ఎక్కువగా

సినిమాల్లో నటించడం లేదు. 

శిల్పాశెట్టి కూడా తన కన్నా చిన్నవాడైన

రాజ్ కుంద్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ఇటీవల రాజ్ కుంద్రా పలు వివాదాస్పద

సుల్లో జైలుకు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. 

బాలీవుడ్ బ్యూటీ.. ప్రియాంక చోప్రా

తనకన్నా వయసులో 11 ఏళ్లు చిన్నవాడైన

నిక్ జోనస్ ను ప్రేమ వివాహం చేసుకుంది.

వీరిద్దరి దాంపత్యం అన్యోన్యంగా 

aకొనసాగుతుంది.

బాలీవుడ్ సుందరి కరీనా కపూర్ ని

సైఫ్ అలీ ఖాన్  రెండో వివాహం చేసుకున్న 

విషయం తెలిసిందే.

అయితే సైఫ్ అలీ ఖాన్ కన్నా కరీనా

పదేళ్లు చిన్నది. అంతుకు ముందు తనకన్నా

13 ఏళ్లు పెద్ద అయిన అమృతాసింగ్ ని వివాహం

చేసుకున్నాడు సైఫ్ అలీ ఖాన్.

బాలీవుడ్ లో తన అందాలతో కుర్రాళ్ల

మతులు పోగొట్టిన బిపాషా బసు తన కన్నా

మూడేళ్లు చిన్నవాడైన కరణ సింగ్ గ్రోవర్ను

పెళ్లి చేసుకుంది.

భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ

నటి అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి 

చేసుకున్నాడు. అయితే కోహ్లీ కన్న

అనుష్క శర్మ ఆరు నెలలు పెద్ద.