భారత ఆర్ధిక మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
టిండల్, సుఖాని, ఇంజిన్ డ్రైవర్, లాంచ్ మెషిన్, ట్రేడ్స్‌మ్యాన్, సీమ్యాన్ విభాగాల్లో 27 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టును బట్టి 8వ తరగతి, 10వ తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఈ పోస్టులకు అప్లై చేసే దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్య వివరాలు: మొత్తం ఖాళీలు: 27 విభాగాలు:
అర్హతలు: టిండల్, సుఖాని, ఇంజిన్ డ్రైవర్, లాంచ్ మెకానిక్ ఉద్యోగాలకు 8వ తరగతి అర్హత కాగా, సీమ్యాన్ ఉద్యోగాలకు 10వ తరగతి అర్హతగా నిర్ణయించారు.
ఇక ట్రేడ్స్‌మ్యాన్ ఉద్యోగాలకు కనీస అర్హత 10వ తరగతి కాగా మెకానిక్/డీజిల్/ఫిట్టర్/టర్నర్/ఎలక్ట్రీషియన్/ కార్పెంట్రీ/ఇంస్ట్రుమెంటల్ కోర్సుల్లో ఐటీఐలో ఉతీర్ణత సాధించి ఉండాలి.
అలాగే.. ఉద్యోగాలను బట్టి 3 నుంచి 10 ఏళ్ల వరకు సంబంధిత పనిలో పనిచేసిన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: సీమ్యాన్, ట్రేడ్స్మేన్ ఉద్యోగాలకు 18 నుంచి 25 ఏళ్ళ లోపు వారు, సుఖాని, లాంచ్ మెకానిక్ ఉద్యోగాలకు 18 నుంచి 30 ఏళ్ళ లోపు వారు, టిండల్, ఇంజిన్ డ్రైవర్ ఉద్యోగాలకు 18 నుంచి 35 ఏళ్ళ లోపు వారు అర్హులు.
వయోపరిమితి: సీమ్యాన్, ట్రేడ్స్మేన్ ఉద్యోగాలకు 18 నుంచి 25 ఏళ్ళ లోపు వారు, సుఖాని, లాంచ్ మెకానిక్ ఉద్యోగాలకు 18 నుంచి 30 ఏళ్ళ లోపు వారు, టిండల్, ఇంజిన్ డ్రైవర్ ఉద్యోగాలకు 18 నుంచి 35 ఏళ్ళ లోపు వారు అర్హులు.
లాంచ్ మెకానిక్ – రూ. 25,500 నుంచి రూ. 81,100
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 14, 2022