ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఏదో ఓ సమయంలో జుట్టుకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారు.

సామాన్యంగా అందరూ నల్లని, ఒత్తైన పొడవైన జుట్టు ఉండాలని భావిస్తారు. 

ఇందుకోసం మార్కెట్‌లో దొరికే రకరకాల నూనెలు, షాంపులతో ప్రయోగాలు చేస్తారు. 

ఇంత ఖర్చు చేస్తే.. ఆశించిన ఫలితం వస్తుందా అంటే డౌటే. పైగా రసాయనాల బాధ.

అందుకే వీటికి బదులుగా ఆముదం వాడి.. నల్లని, ఒత్తైన జుట్టును పొందవచ్చు అంటున్నారు నిపుణులు. 

ఆముదం చెట్టులోని ప్రతి భాగం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీన్ని సంస్కృతంలో ఏరండా, వర్థమాన్‌ అనిపిలుస్తారు.

ఇక పూర్వ కాలంలో ఆముదాన్ని వంటకు వాడేవారు. ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో వాడుతున్నారు. 

ఆముదం నూనె చిక్క‌గా, జిగురుగా ఉంటుంది. ఎలాంటి వాసన ఉండదు క‌నుక దీనిని వాడ‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. 

కానీ వారానికి ఒక్క‌సారైనా ఆముదం నూనెను జుట్టుకు బాగా ప‌ట్టించి గోరు వెచ్చటి నీటితో త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా పెరుగుతుంది అంటున్నారు నిపుణులు.

మ‌న జుట్టుకు ఆముదం నూనె మంచి కండిషనర్‌గా కూడా ప‌ని చేస్తుంది. 

అలానే త‌ల‌నొప్పితో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు మ‌నం త‌ర‌చూ వాడే నూనెలో ఒక టేబుల్ స్పూన్ ఆముదం క‌లిపి వెంట్రుక‌ల కుదుళ్ల‌కు ప‌ట్టేలా బాగా మ‌సాజ్ చేయాలి.

ఇలా చేయడం వల్ల శరీరం వేడి త‌గ్గుడమే కాక త‌ల‌నొప్పి, క‌ళ్ల మంట‌లు కూడా తగ్గుతాయి. అంతేకాక జుట్టు రాల‌డం, జుట్టు చివ‌ర్లు చిట్ల‌డం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

బ‌య‌ట దొరికే షాంపుల‌ను, నూనెల‌ను, కండిష‌న‌ర్‌లను వాడ‌డానికి బ‌దులుగా ఆముదం నూనెను ఉప‌యోగించడం వ‌ల్ల ఎటువంటి దుష్ప‌భ్రావాలు లేకుండా జుట్టు స‌మ‌స్య‌లన్నీ త‌గ్గి న‌ల్ల‌ని, ఒత్తైన జుట్టును పొందవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.