రోడ్డు ప్రమాదాలు మిగిల్చే విషాదం మాటల్లో చెప్పలేనిది.
యాక్సిడెంట్ల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య అంతకంతకీ పెరుగుతోంది. అక్కడా ఇక్కడా అనే తేడాల్లేకుండా అన్ని చోట్ల యాక్సిడెంట్లు చోటుచేసుకుంటున్నాయి.
నిర్లక్షంగా డ్రైవింగ్ చేయడం, ఆల్కహాల్ సేవించి వాహనాలు నడపడం, స్పీడ్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు.
పైకారణాలతో పాటు వెహికల్స్ కండీషన్ సరిగ్గా లేకపోవడం కూడా యాక్సిడెంట్లకు కారణమవుతోంది.
ముఖ్యంగా టైర్లు పంచర్ కావడం, హఠాత్తుగా అవి పేలిపోవడం, స్కిడ్ కావడం లాంటి వాటి వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
వెహికిల్ టైర్ల కండీషన్ సరిగ్గా లేకపోతే రోడ్ల మీదకు రావొద్దని మహారాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
టైర్లు బాగా లేని కార్లు, ఇతర ఫోర్ వీలర్లను నాగ్‌పూర్-ముంబై ఎక్స్‌ప్రెస్ వే మీద ప్రయాణాలు నిషేధించింది సర్కారు.
ఒకవేళ వాహనాల టైర్లు బాగోలేకున్నా ఆ ఎక్స్‌ప్రెస్ వే పై ప్రయాణిస్తే రూ.20 వేల వరకు జరిమానా పడుతుంది.
ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ వే పై జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువగా టైర్ల పరిస్థితి బాగోలేనందునే జరుగుతున్నాయని మహారాష్ట్ర గవర్నమెంట్ భావిస్తోంది.
అందుకే టైర్ల కండీషన్ బాగోలేని వాహనాలను ఆ రహదారిపై రాకపోకలు సాగించేందుకు బ్యాన్ విధించింది.
మరి.. టైర్ల కండీషన్ బాగోకపోతే వాహనాలు రోడ్ల మీదకు రావొద్దంటూ వేసిన కొత్త రూల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.