5 లక్షల లోపు బెస్ట్ బడ్జెట్ కార్ల వివరాలు!

 ప్రస్తుత కాలంలో బైకులు, కార్లు అనేవి లగ్జరీ వస్తుల నుంచి అవసరాల క్యాటగిరీలోకి మారిపోయాయి. చాలా మంది మధ్యతరగతి వాళ్లు కారు కొనేందుకు సందేహిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం రూ.5 లక్షలలోపు ఎక్స్‌ షోరూమ్ ధరతో దొరికే బెస్ట్‌ కార్ల వివరాలు ఏంటో తెలుసుకుందాం.

2022లోనే కాదు గత కొంతకాలంగా బెస్ట్‌ బడ్జెట్ కార్లలో క్విడ్ ఎప్పుడూ ఉంటుంది. ఇది రెనాల్ట్‌ కైగర్‌ కారుకు స్పేస్, ఫీచర్లలో చాలా దగ్గరగా ఉంటుంది.

రెనాల్ట్ క్విడ్‌

ఇది బేసిక్‌ 800 సీసీ 3 సిలిండర్ ఇంజిన్‌ తో లభిస్తుంది. దీనిని 1000 సీసీ వరకు పెంచుకోవచ్చు

రెనాల్ట్ క్విడ్‌

దీని ఎక్స్‌ షోరూం ధర రూ.4.64 లక్షల నుంచి  5.96 లక్షల వరకు ఉంటుంది.

ఈ కారు బేసిక్‌ 800 సీసీ 3 సిలిండర్‌ ఇంజిన్‌ తో అందుబాటులో ఉంది. మరో వేరియంట్‌ 1000 సీసీతో కూడా లభిస్తోంది.

డట్‌ సన్‌ రెడీ గ

1000 సీసీ ఇంజిన్‌లో మీకు ఆటోమేటిక్‌ వేరియంట్‌ కూడా అందుబాటులో ఉంది.

డట్‌ సన్‌ రెడీ గ

ఈ  కారు ధర రూ.3.97 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన కార్లు బడ్జెట్‌ ఫ్రెండ్లీ అని అందరికీ తెలిసిందే. వాటిలో ముఖ్యంగా ఆల్టో 800 కారు ప్రతి మధ్యతరగతి వ్యక్తి కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది .

మారుతీ సుజుకీ ఆల్టో 800

మారుతీ సుజుకీ ఆల్టో 800

దీని ధర  రూ.3.39 లక్షల - రూ.5.03 లక్షల వరకు ఉంటుంది

ఈ కారు సీఎన్జీ మోడల్ లో కూడా లభిస్తుంది

హ్యూండాయ్ శాంట్రో

ఈ కారు 1100 సీసీ 4 సిలిండర్‌ ఇంజిన్‌, 67 హార్స్ పవర్‌తో కూడి ఉంటుంది.  మాన్యువల్‌ తో పాటు ఆటోమేటిక్‌ వేరియంట్‌ కూడా లభిస్తోంది. అంతేకాకుండా సీఎన్జీ కూడా అందుబాటులో ఉంది.

హ్యూండాయ్ శాంట్రో

ఈ కారు ధర విషయానికి వస్తే.. రూ.4.90 లక్షల నుంచి రూ.7.70 లక్షల వరకు ఉంటుంది.

మారుతీ సుజుకీ ఎస్‌-ప్రెసో

బడ్జెట్ కార్లలో మారుతీ సుజుకీ ఎస్‌ప్రెసో పేరు కచ్చితంగా ఉండాలి.  తక్కువ ధరలో ఎక్కువ సీసీ, ఎక్కువ కంఫర్ట్‌ ఈ కారు అందిస్తుంది.  అంతేకాకుండా ఆటోమేటిక్‌ వేరియంట్‌ ఈ కారులో లభిస్తోంది. .

మారుతీ సుజుకీ ఎస్‌-ప్రెసో

ఏబీఎస్‌, ఎయిర్‌ బ్యాగ్స్‌, టచ్‌ స్క్రీన్‌ ఇలా ఎన్నో మంచి ఫీచర్లు ఉన్నాయి.

ఈ కారు ప్రారంభ ధర రూ.4 లక్షల క్స్‌ షోరూమ్ నుంచి 5.64 లక్షల వరకు ఉంటుంది.