పాప్ కార్న్ టేస్ట్ సూపర్ గా ఉంటుంది. అందుకే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినేస్తారు.

థియేటర్ కి వెళ్లి సినిమా చూడటంతో పాటు పాప్ కార్న్ కూడా చాలామంది లాగించేస్తుంటారు.

ఎంత తిన్నాసరే ఇంకా ఇంకా తినాలనిపించడం పాప్ కార్న్ స్పెషాలిటీ. నిజానికి ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిదట.

పాప్ కార్న్ లో ఫైబర్, కార్బోహైడ్రేట్స్, ఐరన్, జింక్, మెగ్నీషియం, విటమిన్ బి లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

అయితే పాప్ కార్న్ ని బరువు తగ్గాలనుకునేవారు తినొచ్చా? లేదా? అన్న డౌట్లు చాలా మందికి వస్తుంటాయి.

చెప్పాలంటే ఎవ్వరైనా సరే దీనిని ఎలాంటి డౌట్లు పెట్టుకోకుండా తినొచ్చు. పాప్ కార్న్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి.

పాప్ కార్న్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు పాప్ కార్న్ ని నిరభ్యంతరంగా తినొచ్చు.

అయితే దీనిని తయారుచేసేటప్పుడు అందులో వెన్న, స్వీట్లు లేదా మరేదైనా కృత్రిమ పదార్థాలను కలపకండి. ఇలా చేస్తే హెల్త్ కి మంచిది కాదు.

ఊబకాయం ఉన్నవారికి ఇది చాలా డేంజర్. బరువు తగ్గాలనుకునే వారు ఉప్పు, తీపి, వెన్న లేని పాప్ కార్న్ తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

షుగర్ ఉన్నాసరే పాప్ కార్న్ తినొచ్చు. ఇందులో కేలరీలు చాలా తక్కువ, ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దీనివల్ల ప్రాబ్లమ్ ఏం ఉండదు.

కాకపోతే బయటదొరికే పాప్ కార్న్ కాకుండా ఇంట్లోనే తయారుచేసుకునే పాప్ కార్న్ తినాలి. లిమిట్ లోనే తినడం చాలా బెటర్.

మొక్కజొన్న వంటి తృణధాన్యాల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. అయినా పాప్ కార్న్ మితంగా తినడమే మంచిది.

పాప్ కార్న్ లో మంచి మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది మీ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పిల్లలు, పెద్దల్లో మలబద్దకాన్ని నివారిస్తుంది.

మియామి యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం.. మొక్కజొన్నలోని ఫైబర్, పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. మీ ఆహారంలో మొక్కజొన్న ఫైబర్ ఉంటే పొట్టలో ఇబ్బందులు తగ్గుతాయి

ఏదేమైనా సరే బాగుంది కదా అని దేన్ని ఎక్కువ తినకూడదు. పాప్ కార్న్ కూడా అలానే తక్కువగానే తినండి.

నోట్: పైన చిట్కాలు ఫాలో అయ్యేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా కూడా తీసుకోవడం మంచిది.