చలికాలంలో ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

చలికాలంలో సజ్జ, జొన్న, బార్లీ, రాగి పిండ్లతో చేసిన రోటీలు తింటే మంచిది. 

చలికాలంలో పెసరపప్పు కూడా తినవచ్చు. 

చలికాలంలో క్యారెట్స్, ఉల్లిపాయలు, పచ్చి బఠానీ, ఉసిరికాయలు, బచ్చలికూర వంటివి శరీరాన్ని వెచ్చగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.  

తులసి టీ, అల్లం టీ ఒంటికి మంచిది. వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ బయోటిక్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. 

కూరల్లో ఆవాలు, ఇంగువ, నల్ల మిరియాలు, మెంతులు, జీలకర్ర వంటివి వేసుకోవడం వల్ల చలికాలంలో వచ్చే జలుబు, కఫ సంబంధిత వ్యాధులను నయం చేస్తాయి. 

ఉల్లిపాయలు, మిరియాలు, మసాలా దినుసులతో సూప్స్ చేసుకుని తాగితే జీర్ణక్రియ మెరుగ్గా పని చేస్తుంది.

పప్పులో మెంతులు, మెంతి పొడి వేసుకుంటే ఆకలి పుట్టేలా చేస్తుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.

ఉదయం పాలలో బాదం, వాల్ నట్స్, పిస్తా వంటివి యాడ్ చేసుకుంటే శరీరం వెచ్చగా ఉంటుంది

ఓట్స్ కాంబినేషన్, ఆప్రికాట్స్, ఎండు ద్రాక్ష, ఫిగ్స్ వంటివి అల్పాహారంలో తీసుకుంటే మంచిది. 

నెయ్యి తింటే లావు అవుతారని అనుకుంటారు. కానీ నెయ్యి ఆరోగ్యకరమైన కొవ్వు అని నిపుణులు చెబుతున్నారు. 

నెయ్యి శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించి శరీర బరువుని నియంత్రణలో ఉంచుతుంది.

రోజూ ఒక చెంచాడు నెయ్యి తీసుకుంటే బరువు కంట్రోల్ లో ఉండడంతో పాటు చర్మం మెరుస్తుంది.