మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా కావచ్చు, తల్లిదండ్రుల జన్యు పరమైన కారణాలతో కావచ్చు అందరిని జుట్టు రాలే     సమస్య వేధిస్తుంది.

చిన్న వయసులోనే చాలా మందికి జుట్టు రాలడంతో పాటు బట్టతల కూడా తొందర్లనే వస్తుంది.

ఈ సమస్యతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు క్రమంగా పెరిగి పోతూ ఉంది. 

ఈ జుట్టు రాలే సమస్యతో ఎంతో మంది మానసికంగా కృంగిపోతూ చివరికి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. 

జుట్టు రాలే సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది మార్కెట్ దొరికే ఎన్నో రకాల హెయిర్ ఆయిల్స్, షాంపోలు వాడుతూ వాడుతుంటారు.

ఇలా ఎన్ని మందులు వాడినా కూడా ఎలాంటి ఫలితాలు రాకపొవడంతో బట్టతల ఉన్న వ్యక్తులు నిరాశలో కృంగిపోతున్నారు.

జుట్టు రాలే సమస్య నుంచి బయట పడతామని చాలా మంది గుండు కొట్టుకుంటుంటారు.

గుండు కొట్టుకుంటే జుట్టు రాలే సమస్య నుంచి బయటపడడంతో పాటు కొత్త జుట్టు పెరుగుతుందని చాలా మంది గుడ్డిగా నమ్ముతుంటారు.

గుండు కొట్టుకుంటే జుట్టు రాలే సమస్య నుంచి బయటపడొచ్చనే ప్రశ్నకు వైద్య నిపుణులు చెబుతున్నది వేరాలా ఉంది.

గుండు కొట్టుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడొచ్చా? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

గుండు కొట్టుకోవడం ద్వారా జుట్టు రాలే సమస్య తగ్గతుందని మాత్రం శాస్త్రీయ ఆధారాలు ఏం లేవని చెబుతున్నారు.

గుండు కొట్టుకోవడం ద్వారా జుట్టు రాలే సమస్య నుంచి బయటపడతామని ఆలోచించడం మాత్రం నిజం కాదని తెలియజేస్తున్నారు.

గుండు కొట్టుకోవడం ద్వారా జుట్టు రాలే సమస్యను తగ్గించలేమని, కానీ తలపై పేరుకుపోయిన చుండ్రును మాత్రం నివారించవచ్చని నిపుణులు అంటున్నారు.