పుట్టగొడుగులు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ సరైన వాటిని ఎంచుకోవడంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని విషపూరితమైన పుట్టగొడుగులు కూడా ఉంటాయి. అవి తింటే చనిపోయే ప్రమాదముంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

గర్భిణీలు పుట్టగొడుగులు తినొచ్చా ? సాధారణంగా గర్భిణీగా ఉన్నప్పుడు ఏం తినాలో ఏం తినకూడదో ఇంట్లో వాళ్లకు బాగా అవగాహన ఉండాలి.

కొన్నిసార్లు తినేవి మంచివే అయినా సరే గర్భిణుల ఆరోగ్యానికి చెడు చేస్తాయేమో అని ఓసారి ఆలోచించుకోవాలి.

కొన్నింటిని తీసుకుంటే తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యానికి కూడా ప్రమాదం. ఇంతకీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు పుట్టగొడుగులు తినొచ్చా?

పుట్టగొడుగుల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటి ఆక్సిడెంట్లు లాంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. 

గర్భిణీలు వీటిని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో పుట్టగొడుగులను తినవచ్చు.

ఇవి తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం చాలా అవసరం.  

సాధారణంగా మార్కెట్ లో చాలారకాల పుట్టగొడుగులు అందుబాటులో ఉంటాయి

వీటిలో పారాసోల్ పుట్టగొడుగులు, ఫాల్స్ మోరల్స్ పుట్టగొడుగులను తినకూడదు.

మష్రూమ్స్ ని ఎప్పుడూ పరిమిత మోతాదులోనే తినాలి. అదే పనిగా అస్సలు తినకూడదు. నీళ్లతో బాగా శుభ్రం చేసి ఉడికించిన తర్వాతే తినాలి. పచ్చివి అస్సలు తినకూడదు.

పుట్టగొడుగులు తాజాగా ఉన్నప్పుడే తినాలి. నిలువ ఉంటే పురుగులు చేరే ఛాన్స్ ఎక్కువ. అందుకే తాజాగా ఉన్న వాటినే కొనుక్కొని వండుకొని తినాలి.

గర్భిణులు మష్రూమ్స్ తినొచ్చు కానీ మీ ఆరోగ్యాన్ని బట్టి ఇవి తినడం మంచిదో కాదో.. మీ డాక్టర్ ని అడిగి తినడం బెటర్. అలా అయితేనే వాళ్లకు మంచిదని నిపుణులు చెబుతున్నారు.

నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా కూడా తీసుకోండి.