సమ్మర్ వచ్చేసింది. ఎండల దెబ్బకు అందరూ హడలెత్తిపోతున్నారు.
ఫుడ్ కంటే కూల్ గా ఉండే డ్రింక్స్ ని ఇష్టపడుతున్నారు.
అయితే శ్వాసకోస సమస్యల వల్ల కావొచ్చు, డయాబెటిస్ లాంటి ప్రాబ్లమ్స్ వల్ల కావొచ్చు. అందరూ శీతల పానీయాలు తాగలేరు.
ఎండ వేడి, డీ హైడ్రేషన్, నీరసం లాంటి వాటిని దూరం చేసే వాటిలో కొబ్బరినీళ్లు ఎప్పుడు టాప్ లోనే ఉంటాయి.
ఏదో నోటికి రుచి మాత్రమే కాదు కొబ్బరినీళ్ల వల్ల లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా దక్కుతాయి.
అయితే చాలామందికి షుగర్ పేషెంట్స్ కు ఓ డౌట్ ఉంది. ఈ జబ్బు ఉంటే కొబ్బరి నీళ్లు తాగొచ్చా లేదా అని..?
ఓ కప్పు కొబ్బరినీళ్లలో చక్కెర, కార్బోహైడ్రేట్స్, సోడియం, పొటాషియం, ఐరన్, విటమిన్ సి, మెగ్నీషియం, ఫైబర్, ప్రొటీన్, కొవ్వులు ఉంటాయి.
మరి చక్కెర కంటెంట్ ఉంది కదా.. షుగర్ వ్యాధిగ్రస్తులు.. కొబ్బరి నీళ్లు తాగొచ్చా అంటే నిపుణులు అవునని చెబుతున్నారు.
కొబ్బరినీళ్లలోని సోడియం, పొటాషియం.. షుగర్ వ్యాధి ఉన్నవాళ్లకు మేలుచేస్తాయని నిపుణులు అంటున్నారు.
కొబ్బరినీళ్లలోని లారిక్ యాసిడ్ పుష్కలంగా ఉండటం వల్ల మన శరీరంలోని వ్యాధికారిక క్రిములు నాశనం అవుతాయట.
ఇలా జరగడం వల్ల ప్రస్తుతం అంతటా ఇబ్బందిపెడుతున్న వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు లాంటి వాటి నుంచి రక్షణ లభిస్తుంది.
అలానే కొబ్బరినీళ్లు తాగడం వల్ల మన రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు కూడా కంట్రోల్ లోనే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
కొబ్బరి నీళ్లలోని యాంటీ ఆక్సిడెంట్, హైపోగ్లైసీమెక్, నెఫ్రో ప్రొటెక్టివ్.. డయబెటిస్ పేషెంట్స్ కు మేలు చేస్తాయి తప్పితే కీడు చేయవు.
కొబ్బరినీళ్లు రోజూ తాగడం వల్ల మీ రక్తంలోని షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి.
ఎక్కువగా టెన్షన్ పడటం, బ్లడ్ షుగర్ కు లింక్ ఉంటుంది. కొబ్బరినీళ్లు తాగడం వల్ల ఈ రెండూ కంట్రోల్ లోకి రావడానికి సహాయపడతాయి.
కొబ్బరినీళ్లు తాగడం వల్ల మీ జీవక్రియ మెరుగుపడుతుంది. పొట్ట కూడా త్వరగా నిండిన ఫీలింగ్ కలుగుతుంది.
కొబ్బరినీళ్లలోని బయో యాక్టివ్ ఎంజైమ్స్.. మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును విచ్ఛిన్నం చేస్తాయి.
చాలామందికి రక్త ప్రసరణ కారణంగా కండరాల నొప్పులు, కిడ్నీ సమస్యలు వస్తుంటాయి. కొబ్బరినీళ్లు తాగడంవల్ల అవి తగ్గుతాయి.
కొబ్బరి నీళ్లని.. మీరు రోజులో ఏ టైంలో అయినా తాగొచ్చు. అయితే ఉదయం తాగితే మాత్రం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
గ్లాస్ కొబ్బరినీళ్లు తాగితే రోజంతా మీ బాడీ ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటుంది. కానీ రోజులో ఒకటి కంటే ఎక్కువ గ్లాసుల కొబ్బరినీళ్లు మాత్రం అస్సలు తాగొద్దు.
నోట్: పైన చెప్పిన పాయింట్స్ పాటించేముందు మీకు తెలిసిన డాక్టర్, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.