చక్కెర వ్యాధి ఉన్న వాళ్లు ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు.

అలా కాదని తీసుకున్నారంటే వ్యాధి మరింత ముదురుతుంది.

అయితే ఖర్జూరాలు తియ్యగా ఉంటాయి కాబట్టి చక్కెర వ్యాధి ఉన్న వారు ఖర్జూరాలను తినకూడదని అంటుంటారు.

కానీ, చక్కెర వ్యాధి వచ్చిన వారు ఖర్జూరాలను తింటే చరక్తంలో క్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని ఆరోగ్య నిపుణుల అభిప్రాయపడుతున్నారు.

ఖర్జూరాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే.

వాటిలో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు సంపూర్ణంగా ఉంటాయి. 

వీటినే తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది.

అంతేకాదు! ఖర్జూరాల వల్ల మరికొన్ని లాభాలు కూడా ఉన్నాయి. అవేంటంటే..

ఖర్జూరాల్లో ఉండే యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు క్యాన్సర్‌ నుంచి రక్షణ కల్పిస్తాయి.

ఖర్జూరాల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా చేయడానికి  ఉపయోగపడుతుంది.

ఈ ఖర్జూరాల్లో రక్తాన్ని పెంచే ఐరన్, ఎముకలను స్ట్రాంగ్ గా ఉంచే కాల్షియం పుష్కలంగా ఉంటాయి.

ఖర్జూరాలు రక్తంలో చక్కెర శాతాలను ఏ మాత్రం పెంచవు.

దాని బదులుగా చక్కెర స్థాయిలను నియంత్రణలో పెడతాయి. రోగులు కేవటం 3 ఖర్జూరాలకు మించి తినడం మంచిది కాదు.