మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కొంతమంది మానలేరు.

ఈరోజుతో లాస్ట్ పెగ్, రేపటి నుండి ఇక తాగను అని తీర్మానించుకుంటారు. 

తెల్లారి చీకటి పడ్డాక మళ్ళీ మామూలే. సిగరెట్ విషయంలోనూ ఇంతే. 

సీరియస్ గా మందు, సిగరెట్ అలవాట్లు మానేయాలి అని అనుకుంటే గనుక ఈ వెబ్ స్టోరీ మీకోసమే.. 

మీకు ఈ రెండు అలవాట్లు ఉంటే గనుక పచ్చిక బయళ్లలో తిరగండి.

నిత్యం పచ్చని ప్రదేశాల్లో గడిపేందుకు ప్రయత్నం చేయండి.

ఇలా చేస్తే నెగిటివిటీ పోయి పాజిటివ్ వైబ్ కలుగుతుంది.

ప్రకృతిని మించిన నేస్తం లేదు. ఆ నేస్తం ఒడిలో సేద తీరితే వేరే ఆలోచనలే రావు. 

మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. 

పచ్చని మొక్కలు, పచ్చని వాతావరణం మధ్య కాసేపు గడిపితే సిగరెట్, మందు తాగాలన్న కోరికలు చచ్చిపోతాయి.

ఇంట్లో కూడా ఎక్కువగా మొక్కలు పెంచుకుని.. రోజూ వాటి మధ్య ఉండాలి. 

అలా చేస్తే సహజమైన ఏసీ గాలి పీల్చుకోవచ్చు. ఎక్కువ కాలం ఊపిరితో ఉండవచ్చు. 

రోజూ ఇలా చేస్తే కేవలం సిగరెట్, మద్యం అలవాట్లే కాదు జంక్ ఫుడ్ తినాలన్న కోరిక కూడా తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.   

ఇదొక్క మార్గమే కాకుండా, వేరే మార్గం కూడా ఉంది. 

నిమ్మరసం, బ్లాక్ పెప్పర్ లకి విపరీతమైన కోరికలను తగ్గించే గుణాలు ఉన్నాయి.