మారుతున్న ఆహారపు అలవాట్లు, పొల్యూషన్ మనిషి జీవితం మీద విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

దాంతో మనిషి చిత్ర విచిత్రమైన జబ్బులతో అనారోగ్యాల బారిన పడుతున్నాడు.

ఈ మధ్య కాలంలో తరచుగా వినిపించే సమస్య నిద్రలేమి.

పని ఒత్తిడి, సమస్యల ఒత్తిడితో మనిషికి నిద్రలేకుండా పోతోంది.

ఇలా నిద్రలేమితో సతమతమయ్యేవారు పాలు, తేనెలను కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు వైద్యులు.

రోజూ రాత్రి పడుకునే 30 నిమిషాల ముందు ఓ గ్లాస్ పాలలో ఓ స్ఫూన్ తేనె కలుపుకుని తాగితే నిద్ర చక్కగా పడుతుంది.

దాంతో నిద్రలేమి సమస్య దూరం అవుతుంది.

పాలు, తేనె మిశ్రమం కేవలం నిద్ర లేమికే కాకుండా ఎన్నో సమస్యలకు చక్కని పరిష్కారం చూపుతుందని నిపుణులు అంటున్నారు.

రోజూ ఓ గ్లాస్ పాలలో ఓ స్ఫూన్ తేనె కలుపుకుని తాగితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

దాంతో రోగాల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

అదీకాక ఈ మిశ్రమం చర్మానికి రక్షణ కవచంగా నిలుస్తుంది. 

స్కిన్ మెరిసిపోవడానికి, మృదువుగా మారడానికి పాలు, తేనెలు ఎంతగానో సహాయపడతాయి.

వీటిలో ఉంటే యాంటీ మైక్రోబియల్ గుణాలు జీర్ణ సమస్యలను దూరం చేసి, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం లాంటి వాటిని నయం చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.

ఇక పాలల్లో ఉండే కాల్షియం ఎముకల దృఢత్వానికి ఎంతగానో తొడ్పడుతుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి.