చియా విత్తనాలలో పోషకాలు అధికంగా ఉంటాయి.

డయాబెటిస్ ఉన్నవాళ్లకి చియా గింజలతో మంచి ప్రయోజనాలు ఉన్నాయి.

చియా విత్తనాల్లో ఉండే ఫైబర్, మెగ్నీషియం, ఫ్యాటీ యాసిడ్స్ టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

చియా విత్తనాలు తినడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు. 

తద్వారా డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి.

ఒక ఔన్స్ చియా విత్తనాలలో 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. 

వయసును బట్టి రోజుకి 22.4 నుంచి 33.6 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి.

మధుమేహులు అయితే రోజుకి 2 టేబుల్ స్పూన్లు లేదా 20 గ్రాముల చియా విత్తనాలను తినాలి.

గ్లాస్ నీటిలో టేబుల్ స్పూన్ చియా విత్తనాలను, నిమ్మకాయ ముక్కలను వేసి.. గంట తర్వాత తాగితే మంచిది.

డయాబెటిస్ ఉన్నవాళ్లు సలాడ్స్ లో ఈ చియా విత్తనాలను కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

పండ్లు,. కూరగాయలు, గింజలతో పాటు చియా విత్తనాలను కలిపి తిన్నా ప్రయోజనాలు ఉంటయి.

చియా విత్తనాలు, అవిసె గింజలను సలాడ్స్ లో కలిపి తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. 

వీటిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి.   

 అయితే మధుమేహులు చియా విత్తనాలను అధికంగా తింటే దుష్ప్రభావాలు ఉంటాయంటున్నారు.

మధుమేహం, అధిక రక్తపోటు, అలర్జీ, జీర్ణ సమస్యలు ఉన్న వారు చియా విత్తనాలను ఎక్కువగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు.