ఈ రోజుల్లో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా పిజ్జా, బర్గర్ వంటివే కాకుండా రుచి బాగుంటే ఏదిపడితే అది తింటూ అనారోగ్య పాలవుతున్నారు.

తద్వారా 20 ఏళ్ల వయసులోనే 70 ఏళ్లకు పైగా బరువు పెరుగుతున్నారు.

ఆ తర్వాత అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతూ చివరికి గుండెపోటు వంటి రోగాల బారిన పడుతున్నారు.

అయితే పెరిగిన బరువును నియంత్రణలో ఉంచుకునేందుకు చాలా మంది ఎన్నో రకాల వ్యాయమాలు చేస్తుంటారు. 

ఇందులో భాగంగా చెమటలు కక్కెలా యోగా, వ్యాయమం, జిమ్ వంటివి చేస్తున్నారు. 

ఇంతటితో ఆగకుండా రాత్రి పూట అన్నం తినకుండా చపాతీలతో సరిపెట్టుకుంటున్నారు.

అసలు చపాతీలు, రోటీలు తీసుకోవడం వల్ల నిజంగానే బరువు తగ్గుతారా? 

ఇందులో నిజమేంత? అసలు పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు తగ్గాలనుకునే ఉద్దేశంతో చాలా మంది రాత్రిపూట చపాతీల, రోటీలతో సరిపెట్టుకుంటున్నారు. 

చపాతీలు తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారా అంటే.. అందంతా అపోహ మాత్రమేనని పోషకాహర నిపుణులు తెలియజేస్తున్నారు. 

ఎలాంటి ఆహార పదార్థాలైన ఎక్కవ మోతాదులో తీసుకుంటే మాములుగానే బరువు పెరుగుతారని చెబుతున్నారు. 

అయితే తమ శరీర బరువును తగ్గించుకోవాలనుకునే వారు మాత్రం  నెయ్యితో తయారు చేసిన చపాతీ, రోటీ తీసుకోవడం ద్వారా కొంత ఫలితం ఉండొచ్చిన పోషకాహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ఇది కాకుండా తీసుకునే ఆహారంలో సమతూల్యత కూడా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

దీనిపై పూర్తి అవగాహన కోసం నిపుణుల సలహా తీసుకోవాల్సిందిగా మనవి.