రానున్న రోజులు మందుబాబులకు ఇష్టమైన రోజులు. .
ఎందుకుంటే మరికొన్ని రోజుల్లో న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకలలు వస్తున్నాయి
దాంతో ఇష్టమెుచ్చినట్లుగా మద్యం తాగుతుంటారు మందుబాబులు.
అయితే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం మందు ముట్టకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అయితే చాలా మందిలో ఉన్న అనుమానం ఏంటంటే? డయాబెటీస్ పేషెంట్లు మందు తాగొచ్చా? తాగరాదా? అని.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, పండుగల సందర్భంగా బంధువులతో కలిసి మద్యం సేవించడం ప్రస్తుత సమాజంలో ఓ డిగ్నిటీగా భావించబడుతోంది.
అయితే మధుమేహులకు ఆల్కహాల్ చాలా చెడుచేస్తుంది.
అందుకే డయాబెటీస్ పేషంట్లు మద్యానికి దూరంగా ఉండాలంటున్నారు వైద్యులు.
ఆల్కహాల్ కారణంగా రక్తంలో చెక్కర స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి.
దాంతో సమస్య ఇంకా పెద్దది అవుతుంది.
అదీకాక కాళీ కడుపుతో మద్యం సేవించడం మధుమేహులకు చాలా డేంజర్ అంటున్నారు వైద్య నిపుణులు.
డయాబెటీస్ పేషంట్లు మద్యం సేవిస్తే.. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది గుండెపోటుకు దారి తీస్తుంది.
షుగర్ పేషంట్లు తరచుగా మద్యం సేవిస్తే.. వికారం, కంటి చూపు తగ్గడం, మాటల్లో తత్తరపాటు లాంటి దీర్ఘకాలిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
అందుకే మధుమేహులు మద్యానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.
ఆరోగ్యంగా ఉండాలి అంటే మ్యదం పూర్తిగా మానేయడం మంచిదని వారు సూచిస్తున్నారు.