డయాటెటిస్ ఉన్నవారు రోజు తీసుకునే ఆహారం విషయంలో చాలా నియమ నిబంధనలు పాటిస్తుంటారు.

వైద్యుల సూచనల మేరకు తీసుకోవాల్సిన ఆహారమే తీసుకుంటుంటారు. 

అయితే కొంతమంది డయాబెటిస్ పేషెంట్స్ మాత్రం ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలియక తికమకపడుతుంటారు. 

డయాబెటిస్ ఉన్నవారు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి? 

అసలు డ్రై ఫ్రూట్స్ తీనొచ్చా? పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

డ్రై ఫ్రూట్స్ లో చాలా రకాల పోషకాలు ఉంటాయి. 

ఇందులో ఖనిజ లవణాలతో పాటు విటమిన్లు, ఫైటో స్టెరాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. 

ఇన్ని పోషకాలు కలిగి ఉన్న ఈ డ్రై ఫ్రూట్స్ ను తినటానికి డయాబెటిస్ పేషెంట్స్ తికమకపడుతుంటారు. 

అసలు నిపుణులు ఏం చెబుతున్నారంటే? డయాబెటిస్ ఉన్నవారు ఈ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఎలాంటి  ప్రమాదం లేదని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. 

ఎండు ద్రాక్ష, ఖర్జురాలు, అంజీర్ తినడం వల్ల షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం లేదని అంటున్నారు. 

అలా అని మోతాదుకు మించి తినకూడదని కూడా నిపుణులు సూచిస్తున్నారు. 

ఇక వీటితో పాటు బాదాములను రాత్రి నాన బెట్టి ఉదయం పూట తినొచ్చని తెలియజేస్తున్నారు. 

ఇక్కడ మరో విషయం ఏంటంటే? డయాబెటిస్ ఉన్నవారు ఈ డ్రైఫ్రూట్స్ మోతాదుకు మించి తినడం వల్ల లేనిపోని సమస్యలు కూడా రావచ్చని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నోట్: పైన తెలిపిన చిట్కాలు పాటింటే ముందు మీ దగ్గర్లో ఉన్న డాక్టర్ సూచనలు, సలహాలు పాటించండి.