టెక్నాలజీ బాగా పెరిగిపోయిన ఈ కాలంలో చాలా పనులకు సొంత కంప్యూటర్, ల్యాప్ టాప్ అవసరమవుతోంది.

ఇక కొత్తగా ల్యాప్ టాప్ కొనాలనుకునే వారికి కొన్ని విషయాలు తెలిసుండాలి.

ఒకవేళ పొరపాటున సరైనది కొనుగోలు చేయకపోతే మాత్రం ఉపయోగం లేకుండా పోతుంది.

అందుకే ఎలాంటి ల్యాప్ టాప్ కొనాలనే విషయమై ఈ 8 అంశాలు పరిశీలించండి.

చాలామందికి ల్యాప్ టాప్ కొనాలా.. వ్యక్తిగత కంప్యూటర్ కొనాలా అనే డౌట్ ఉంటుంది.

ఇంట్లో మాత్రమే వాడుకోవాలంటే కంప్యూటర్ బెటర్. బయటకు కూడా తీసుకెళ్లాలంటే ల్యాప్ టాప్ తీసుకోండి.

కంప్యూటర్ ఒకవేళ రిపేర్ అయితే తక్కువ ఖర్చుతో తేలిపోతుంది. ల్యాప్ టాప్ అయితే ఖర్చు కాస్త ఎక్కువగానే అవుతుంది.

ఇక చిన్న పనుల కోసమైతే తక్కువ కాస్ట్ ఉండే ల్యాప్ టాప్ బెటర్.

మూవీ, షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ లాంటి వాటి కోసమైతే.. ఎక్కువ ధర ఉన్నదే తీసుకోవాలి.

కొన్ని ల్యాప్ టాప్స్ రిపేర్ ఖర్చు, పరికరాల ధర ఎక్కువగా ఉంటుంది.

అందువల్ల ముందు ఈ విషయం ఆలోచించి ల్యాప్ టాప్ తీసుకోవడం ఉత్తమం.

ఏ ల్యాప్ టాప్ అయినా సరే నాలుగేళ్ల తర్వాత సరిగా పనిచేయదు. సాఫ్ట్ వేర్ వెర్షన్స్ మారిపోతూ ఉంటుంది.

ఎక్కువ రోజులైతే ర్యామ్ కూడా సరిపోదు. కాబట్టి మరీ ఎక్కువ కాస్ట్ ఉన్న ల్యాప్ టాప్ తీసుకుంటే అది భారం కావొచ్చు.

ఈ రోజు కనీసం 8 జీబీ ర్యామ్ ఉండే ల్యాప్ టాప్ లు దొరుకుతున్నాయి.

ఒకవేళ వీడియో ఎడిటింగ్ కోసమైతే మాత్రం కనీసం 32 జీబీ ర్యామ్ ఉండే ల్యాప్ టాప్ తీసుకోండి.

ర్యామ్ పెంచుకునే వీలుండే ల్యాప్ టాప్ తీసుకోవడం మేలు. ఈ విషయమై షాపు వాడితో మాట్లాడితే సరిపోతుంది.

ల్యాప్ టాప్ లకు కనీసం 2 గంటల బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. కాబట్టి కాస్త ఎక్కువ బ్యాకప్ ఉండేది కొనుక్కోండి.

ఈ రోజుల్లో ల్యాప్ టాప్ కాస్ట్ మినిమం రూ.30 వేల నుంచి ఉంటున్నాయి. దీన్ని బట్టి చూసుకుంటే బ్రాండెడ్ ల్యాప్ టాప్ కొనడం మేలు.

సెకండ్ హ్యాండ్ ల్యాప్ టాప్ లతో రిపేర్లు ఎక్కువొచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. కాబట్టి కొత్తదే బెటర్.

ల్యాప్ టాప్ కొన్నా సరే వేరుగా కీబోర్డు, మౌస్ కొనడం ఉత్తమం. ల్యాప్ టాప్ కీబోర్డు పాడైతే ప్యాడ్ మొత్తం మార్చాలి. అందుకే రూ.5 వేల దాకా ఖర్చు అవుతుంది.

దీనికి బదులు కీబోర్డు మార్చుకుంటే.. బ్రాండెడ్ ది అయినా సరే రూ.600కే దొరికేస్తుంది.