ఎండా కాలం ప్రారంభం కాకముందే ఎండలు మండి పోతున్నాయి.
వేసవి తాపం పెరుగుతోంది. ఇంకో నెలరోజుల్లో వేడి తీవ్రత అధికమవుతుంది.
ఇక వేసవి కాలం వచ్చిందంటే.. ఏసీలు, కూలర్ల వినియోగం పెరుగుతోంది.
చాలా మంది వేసవి కాలంలో ఎండ తీవ్రతకు తట్టుకోలేక ఏసీలు కొనుగోలు చేస్తారు.
అయితే ఏసీలు కొనాలనుకునేవారు ముందుగా ఈ విషయాలు తెలుసుకొండి.
ఎంత బడ్జెట్‌లో ఏసీ కొనాలనుకుంటున్నారో ముందుగానే ఓ అంచనా వేసుకొండి.
మొత్తం డబ్బులు ఒకేసారి కడతారా.. లేక ఈఎంఐ ఆప్షన్స్ అనే దాని గురించి కూడా ముందుగానే ఆలోచించుకొండి.
మీరు కొనాలనుకుంటున్న ఏసీకి సంబంధించి ముందుగా ఆన్‌లైన్‌లో ధరలు చెక్ చేయండి.
ఆన్‌లైన్‌లో ధర తక్కువగా ఉంటే.. మీ సేల్స్ పర్సన్‌కి దాని గురించి చెప్పండి. మీకు బెస్ట్ డీల్ లభించే అవకాశం ఉంది.
మీ రూమ్ సైజ్‌ను బట్టి ఏసీని సెలక్ట్ చేసుకొండి. పెద్ద రూమ్, హాల్ అయితే 1.5, 2 టన్, చిన్న రూమ్ అయితే 1 టన్ ఏసీ సెలక్ట్ చేసుకొండి.
మీరు అపార్ట్‌మెంట్‌లో ఉంటే మీ ఫ్లాట్ ఎక్కడ ఉంటుంది.. అన్నింటికన్న పైనా లేదా మధ్యలో ఉంటుందా అన్న దాని మీద ఆధారపడి ఏసీని సెలక్ట్ చేసుకోవాలి.
స్ప్లిట్, విండో ఏసీ రెండింటిలో ఏది బెటర్ అనేది ముందుగానే తెలుసుకొండి.
ఏసీలో అల్యుమినియం కాయిల్ వాడారా.. కాపర్ కాయిల్ వాడారా అన్నది కూడా తెలుసుకోవాలి.
ఏసీ పవర్ సేవింగ్ అనేది దాని మీద ఉన్న స్టార్ల మీద ఆధారపడి ఉంటుంది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏసీని సెలక్ట్ చేసుకొండి.