ఎర్రచందనం.. ఎర్ర బంగారం పేరు ఏదైనా దీనికి డిమాండ్‌ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుంది.

విదేశాల్లో ఎర్రచందనానికి విపరీతమైన డిమాండ్‌.

మరీ ముఖ్యంగా రష్యా, జపాన్‌, చైనా వంటి దేశాల్లో దీనికి మంచి డిమాండ్‌ ఉంది.

ఇక్కడ వంట పాత్రలు మొదలు, సంగీత పరకరాలు తయారీకి దీన్నే వాడతారు.

సౌందర్య సాధనాలు, ఔషధాల తయారీలో కూడా ఎర్ర చందనాన్ని ఎక్కువగా వినియోగిస్తారు.

ఇది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌, శేషాచలం అటవీ ప్రాంతంలో సహజసిద్ధంగా పెరుగుతుంది.

అయితే ఈ మధ్య కాలంలో రైతులు ఎర్ర చందనం సాగు మీద శ్రద్ధ కనబరుస్తున్నారు.

దానికి తగ్గట్టు ప్రభుత్వాలు కూడా సబ్సిడీలు ప్రకటిస్తున్నాయి.

సాధారణంగా ఎర్ర చందనం మొక్క ఒకటి విడిగా 1000-1500 రూపాయలు ఉంటుంది.

కానీ ఎర్రచందనం సాగు చేయాలనుకునే రైతులకు మాత్రం 100-150 రూపాలయకే విక్రయిస్తున్నారు.

వీటి జీవితం కాలం 15-20 ఏళ్ల వరకు ఉంటుంది. ఎకరాకు 600 మొక్కలు నాటవచ్చు.

ఇక మార్కెట్‌లో కిలో చందనం 26-30 వేల రూపాయల వరకు పలుకుతుంది.

ఇక చందనం చెట్టు జీవిత కాలంలో ఒక చెట్టు నుంచి 15-20 కిలోల చందనం లభిస్తోంది.

అంటే ఎంత లేదన్న సులబంగా ఒక చెట్టు నుంచి 5-6 లక్షల రూపాయలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు.

అంటే ఎకరాలకు 600 చెట్లు నాటితే.. వాటి జీవిత కాలంలో ఏకంగా 30 కోట్ల రూపాయలు ఆర్జించవ్చు అంటున్నారు నిపుణులు.