గత కొంత కాలంగా టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వార్తల్లో నిలుస్తూ.. వస్తున్నాడు.

ఇక వెన్నముక గాయం నుంచి కోలుకోకపోవడంతో.. ఐపీఎల్ సీజన్ 2023 మెుత్తానికి బుమ్రా దూరం అయ్యాడు.

దాంతో ముంబై ఇండియన్స్ కు ఐపీఎల్ ప్రారంభానికి ముందే గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

ముంబై జట్టులో కీలక బౌలర్ గా ఉన్న బుమ్రా అందుబాటులో లేకపోవడంతో.. ఆ స్థానాన్ని రీప్లేస్ చేసే ఆటగాడు ఎవరు? అని ప్రపంచం మెుత్తం ఎదురుచూస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంలో అన్ సోల్డ్ ప్లేయర్ పేరు బుమ్రా స్థానానికి సరైనోడుగా వినిపిస్తోంది.

బుమ్రా స్థానాన్ని రీప్లేస్ చేసే సత్తా సందీప్ శర్మకే ఉందని నమ్మిన ముంబై యాజమాన్యం.. అతడిని అప్రోచ్ అయినట్లు సమాచారం.

గత ఐపీఎల్ సీజన్లలో హైదరాబాద్ సన్ రైజర్స్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన సందీప్ శర్మ.. తన పదునైన స్వింగ్ తో బ్యాట్స్ మెన్ ను ముప్పుతిప్పలు పెట్టగలడు.

పవర్ ప్లేలో ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ లతో కట్టుదిట్టంగా బంతులు వేయడంలో సందీప్ శర్మ సిద్దహస్తుడు అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.

104 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన సందీప్ శర్మ.. 7.77 ఎకానమీతో 114 వికెట్లు తీశాడు. తాజాగా విజయ్ హాజరే ట్రోఫీలో కూడా సత్తా చాటాడు సందీప్ శర్మ. 7 మ్యాచ్ ల్లో 13 వికెట్లు పడగొట్టాడు.

దాంతో బుమ్రా ప్లేస్ కు సరితూగే బౌలర్ సందీప్ శర్మనే అని ముంబై యాజమాన్యం భావించి.. అతడిని కలిసినట్లు క్రీడా వర్గాల్లో చర్చనడుస్తోంది.